Sunday, June 21, 2026 04:32 PM
Sunday, June 21, 2026 04:32 PM

బ్రేకింగ్: అయ్.. అన్నొస్తున్నాడోచ్..!

సాధారణ పౌరులు ఏదైనా తప్పు చేస్తే న్యాయస్థానాలకు వెళ్లే పరిస్థితి ఉంటే వాళ్లకు పెద్దగా మినహాయింపులు ఉండవు. వాళ్ల వాదనలు కూడా న్యాయస్థానాలు వినే పరిస్థితి చాలా సందర్భాల్లో ఉండదనే అభిప్రాయం మనం వింటూనే ఉంటాం. కొంతమంది నేరాలు చేసినట్లు సాక్ష్యాలు ఉన్నా సరే న్యాయవ్యవస్థలో ఉన్న లొసుగులను వాడుకుని, కోర్టులకు వెళ్లకుండా వాయిదాలు తెచ్చుకుంటూ ఉంటారు. ఈ విషయంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందు వరసలో ఉంటారు. 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా కోర్టుకు వెళ్లలేదు.

Also Read : నెయ్యి కల్తీగాళ్ళను వెనకేసుకొస్తున్న వైసీపీ

2024 లో అధికారం కోల్పోయిన సరే కోర్టుకు వెళ్లకుండా జగన్ తప్పించుకుంటూనే ఉన్నారు. ఏదో ఒక పిటిషన్ వేస్తూ.. లేదా ఏదో ఒక పర్యటన సాకుతో ఆయన కోర్టుకు దూరంగా ఉంటున్నారు. అయితే ఇటీవల సిబిఐ కోర్టు ఈ అంశాన్ని సీరియస్ గా పరిగణించింది. యూరప్ పర్యటనకు వెళ్లి వచ్చిన తర్వాత ఈనెల 14న కోర్టుకు జగన్ హాజరు కావాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. కానీ తాను కోర్టుకు హాజరైతే భద్రతాపరంగా సమస్యలు ఉంటాయని, కోర్టుకు హాజరు కాలేనని మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరారు. దీనిపై జగన్ తరపు న్యాయవాదులు సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Also Read : బంగారం ఇప్పుడు… కొనాలా ? వద్దా?

తాజాగా ఈ పిటిషన్ సిబిఐ కోర్టు కొట్టేసింది. దీనితో ఈ నెల 21 లోగా తాను కోర్టుకు హాజరవుతానని వైయస్ జగన్ సిబిఐ కోర్టుకు సమాచారం ఇచ్చారు. అక్టోబర్ లో జగన్ యూరప్ పర్యటనకు వెళ్లే ముందు సిబిఐ కోర్టు అనుమతి కోరిన సంగతి తెలిసిందే. కోర్టు అనుమతి మంజూరు చేస్తూ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత నవంబర్ 14న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఓ షరతు పెట్టింది. అయితే తాజాగా కోర్టు ముందు హాజరు కావడానికి తనకు ఏ విధమైన అభ్యంతరం లేదని.. ప్రత్యేక భద్రత ఏర్పాట్లకు అధికార యంత్రాంగానికి ఇబ్బంది కలుగుతుందనే, ఉద్దేశంతోనే మినహాయింపు కోరినట్లు తెలిపిన జగన్, ఈనెల 21న ఖచ్చితంగా హాజరవుతానని కోర్టులో మెమో దాఖలు చేశారు జగన్.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

పోల్స్