Wednesday, October 14, 2026 11:44 PM
Wednesday, October 14, 2026 11:44 PM

ఇంకా కుటుంబానికి దూరంగా.. ఎయిర్ ఇండియా ప్రమాద బాధితుడి నిత్య నరకం..!

జూన్ నెలలో జరిగిన విమాన ప్రమాదంలో పెద్ద ఎత్తున ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ విమానాశ్రాయం నుంచి బయల్దేరిన కాసేపటికే జరిగిన ఈ ప్రమాదంలో 240 మందికిపైగా ప్రాణాలు విడిచారు. ఈ ప్రమాదంలో విమానంలో లేని వారు కూడా ప్రాణాలు కోల్పోగా.. విమానంలో ఉన్న రమేష్ అనే వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం ప్రమాదంలో రమేష్ విశ్వేశ్ కుమార్.. నడిచి రావడం అప్పట్లో సంచలనం అయింది.

Also Read : ఆ విషయంలో వెనక్కి తగ్గిన చంద్రబాబు..!

ప్రమాదంలో జీవించి ఉన్నవారిలో అత్యంత అదృష్టవంతుడిని తానే అని చెప్పుకున్న రమేష్.. ఆ తర్వాత శారీరకంగా, మానసికంగా అనుభవిస్తున్న సమస్యలను అంతర్జాతీయ మీడియాతో పంచుకున్నాడు. తాను ఒంటరిగా ఉంటున్నానని, తన భార్య, కొడుకుతో మాట్లాడటం లేదని తెలిపాడు. తన సోదరుడిని కోల్పోవడం తనకు శూన్యతను మిగిల్చిందని కన్నీటి పర్యంతం అయ్యాడు. తాను తన సోదరుడిని కూడా కోల్పోయానని, తన సోదరుడు తనకు వెన్నెముకగా నిలిచాడు అని చెప్పుకొచ్చాడు.

Also Read : కల్తీ లిక్కర్ కేసులో.. కొత్త పేరు.. తాడేపల్లి ప్యాలెస్ కు లింకులు..!

గత కొన్నాళ్ళుగా తనకు మద్దతుగా నిలిచాడని, అతన్ని కోల్పోయిన లోటు తీరనిది అని చెప్పుకొచ్చాడు. తన గదిలో ఒక్కడే ఉంటున్నాను అని పేర్కొన్నాడు. తన ఇంట్లో తాను ఒంటరిగా ఉండటం తనకు ఇష్టం అని చెప్పుకొచ్చాడు. ఇక రమేష్ కు పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ తర్వాత కొన్ని రోజులకు భారత్ నుంచి లీసెస్టర్ వెళ్ళాడు. అప్పటి నుంచి అతను చికిత్స తీసుకోలేదు. తన కుటుంబం ఇంకా ఆ విషాదాన్ని జీర్ణించుకోలేదని, తన తమ్ముడు ఇప్పుడు లేడని కన్నీళ్లు పెట్టుకున్నాడు. కాలు, భుజం, మోకాలి మరియు వీపులో నిరంతర నొప్పి కారణంగా తాను నడవలేకపోతున్నా అని ఆవేదన వ్యక్తం చేసాడు.

సంబంధిత కథనాలు

- Advertisement -spot_img

తాజా కథనాలు

వైసీపీలో జగన్ ముందు...

“పార్టీ కోసం నిలబడేది ఎవరు..? పదవుల...

హైదరాబాద్ టీ20 ముంగిట...

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న...

ఏపీ బ్రాండ్ ఇమేజ్...

నవ్యాంధ్ర రాజధాని అమరావతి, చారిత్రక నగరమైన...

జగన్ కు మ్యూజిక్...

వైఎస్సార్‌సీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్...

రాహుల్ దెబ్బ.. కేంద్రంలో...

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్ష నాయకుడు...

ఫ్యాక్షన్ గడ్డపై సతీమణుల...

రాయలసీమ రాజకీయాల్లో ఎప్పుడూ అత్యంత వేడి...

పోల్స్