Thursday, February 5, 2026 08:01 AM
Thursday, February 5, 2026 08:01 AM

భారతి సిమెంట్ మేనేజర్ పై కేసు..!

యధారాజా.. తథా ప్రజా అనేది పాత సామెత. ఈ మాట వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సొంత సంస్థలో పని చేసే వారికి కూడా ఆయన తీరే అలవాటు అయినట్లు ఉంది. ఓ భూ కుంభకోణం కేసులో భారతి సిమెంట్ మేనేజర్ భార్గవ్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తక్కువ ధరకే భూమి ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పిన భార్గవ్ రెడ్డి.. డబ్బులు వసూలు చేసి మోసం చేశారు. లేని భూమిని ఉన్నట్లుగా నమ్మించి ఏకంగా 60 లక్షల రూపాయలు వసూలు చేసిన భార్గవ్ రెడ్డి.. ఆ తర్వాత ముఖం చాటేశాడనేది ప్రధాన ఆరోపణ.

Also Read : తిరుమల లడ్డు కేసులో వెలుగులోకి పాపాలు..!

కడప జిల్లాలో ఓ భూ కుంభకోణం కేసులో భారతి సిమెంట్స్ మేనేజర్ భార్గవ్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. భారతి సిమెంట్ మేనేజర్‌ భార్గవ్‌రెడ్డిపై మోసం కేసు నమోదైంది. జగన్ అధికారంలో ఉన్న సమయంలో భూములను తక్కువ ధరకే ఇప్పిస్తానని నమ్మించి మోసం చేశారనేది ఆరోపణ. కడపకు చెందిన మహబూబ్‌ఖాన్ అనే వ్యక్తి దగ్గర భూమి కోసం 60 లక్షలు అడ్వాన్స్‌గా భార్గవ్ రెడ్డి తీసుకున్నారు. 10 కోట్ల విలువైన భూమిని కేవలం 3 కోట్ల రూపాయలకే ఇప్పిస్తామని కొందరు మహబూబ్‌ఖాన్‌కు మాయమాటలు చెప్పారు. ఈ వ్యవహారంలో భార్గవ్ రెడ్డి కీలక పాత్ర పోషించారనేది మహబూబ్‌ఖాన్ ఆరోపణ.

Also Read : అజారుద్దీన్ శాఖ అదేనా..? కానీ మరో అడ్డంకి కూడా..?

భార్గవ్ మాటలు నమ్మిన మహబూబ్‌ఖాన్ అగ్రిమెంట్ రాయించుకుని 60 లక్షల రూపాయలు అడ్వాన్స్‌గా కూడా చెల్లించారు. అయితే ఆ తర్వాత నుంచే అసలు కథ మొదలైంది. అడ్వాన్స్ తీసుకున్న కేటుగాళ్లు.. మహబూబ్‌ఖాన్‌కు పెద్ద టోపీ పెట్టారు. భూమి చూపించకుండా తప్పించుకుని తిరిగారు. దీంతో అనుమానపడిన మహబూబ్‌ఖాన్ అసలు భూమి ఉందా లేదా.. అని ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. ఆ భూమి వేరే వారి పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన మహబూబ్‌ఖాన్ కోర్టును ఆశ్రయించారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. నెల రోజుల్లో నిందితులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.

Also Read : గిల్ కష్టమే.. ఆస్ట్రేలియాలో మరోసారి తడబ్యాటు..!

కోర్టు ఆదేశాల మేరకు సీకే దిన్నె పోలీసులు భారతి సిమెంట్ మేనేజర్ భార్గవ్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితులుగా ఏడుగురిని చేర్చారు. వీరిలో ప్రొద్దుటూరు కోర్టులో పని చేస్తున్న నల్లపాటి శ్రీనివాసులు, కమలాపురం మండలం పాయసంపల్లెకు చెందిన భారతి సిమెంట్స్‌లో ట్రాన్స్‌ఫోర్ట్‌ ఇన్‌ఛార్జిగా పని చేసే ఎస్‌వై.మహేశ్వరరెడ్డి ఉన్నారు. కడప కోర్టులో డ్రైవర్‌గా పని చేసే బి.సుబ్బరాయుడు, రాయచోటిలో కోర్టులో పని చేసే ఎన్‌.సుబ్బరాయుడు, కడపలో ఓ న్యాయవాది వద్ద క్లర్క్‌గా పని చేసే రాజశేఖర్‌, కడప రాజారెడ్డి వీధికి చెందిన దస్తగిరి, కమలాపురం మండలం నల్లలింగాయపల్లె వద్ద ఉన్న భారతి సిమెంట్స్‌ కంపెనీ మేనేజర్‌గా ఉన్న పి.భార్గవరెడ్డిలను పోలీసులు నిందితులుగా చేర్చారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్