Wednesday, May 6, 2026 11:53 PM
Wednesday, May 6, 2026 11:53 PM

టీడీపీ మహిళా ఎమ్మెల్యే సంచలనం.. చంద్రబాబును కూడా లెక్క చేయడం లేదా..?

సాధారణంగా ప్రభుత్వ అధికారులు ఎమ్మెల్యేలను లెక్కచేయరు అనే మాట మనం వింటూనే ఉంటాం. ముఖ్యంగా ఉన్నతాధికారులు ఎమ్మెల్యేలను కూరలో కరివేపాకు మాదిరి తీసేస్తూ ఉంటారని ప్రచారం జరుగుతూనే ఉంటుంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి అప్పుడప్పుడు ప్రచారం చూస్తూనే ఉంటాం. ఎమ్మెల్యేలు చెప్పిన మాటలను అధికారులు లెక్కచేయకపోవడం.. కనీసం పంపించిన వినతి పత్రాలను కూడా అధికారులు పట్టించుకోకపోవడం వంటివి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం. ఎమ్మెల్యేలను పెద్దగా లెక్కచేయని అధికారులు కొన్ని సందర్భాల్లో మంత్రులను కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు.

Also Read : తిరుమల లడ్డు కేసులో వెలుగులోకి పాపాలు..!

తాజాగా గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మాధవి అధికారులు తీరుపై మండిపడ్డారు. కార్పొరేషన్ అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాధవి. తనకు సమాచారం ఇవ్వకుండానే నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తుఫాను బాధితులకు సహాయం విషయం కూడా తనకు తెలియదని అదేవిధంగా అధికారులు తీరు విభజించి పాలించే తరహాలో ఉందని.. అసలు అధికారులది అహంకారమా లేదంటే అమాయకత్వమా తనకు అర్థం కావడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read : రోహిత్ పెళ్లిలో అంతా తానైన చంద్రబాబు.. మరి జూనియర్ ఎక్కడ?

ప్రభుత్వ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటోలను పెట్టకపోవడం పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో సామాన్యులకు పనులయ్యే పరిస్థితి లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. సచివాలయ సిబ్బంది సమర్థవంతంగా పనిచేయడం లేదని మండిపడ్డారు. అధికారుల దగ్గర్నుంచి సమాధానం వస్తుందని తాను ఆశిస్తున్నట్లు తెలిపిన మాధవి.. ఈ అంశాలను ఖచ్చితంగా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలంగా మంత్రుల విషయంలో కూడా కొంతమంది ఉన్నతాధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదు అనే విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్