Sunday, March 22, 2026 10:25 AM
Sunday, March 22, 2026 10:25 AM

విశ్వంభర.. సెకండ్ ఆఫ్ ఎలా ఉంటుందో తెలుసా..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా విశ్వంభర. ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యమైంది. దీంతో అసలు సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనే అనుమానాలు కూడా తలెత్తాయి. ఇదే సమయంలో చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ఇప్పటికే అనిల్ ప్రకటించారు కూడా. దీంతో. విశ్వంభర వస్తుందా.. రాదా.. అనే పుకార్లు.. అటు టాలీవుడ్‌లో ఇటు మెగా ఫ్యాన్స్‌లో వినిపిస్తున్నాయి. వీటన్నిటికీ చెక్ పెడుతూ మెగాస్టార్ ఓ వీడియో రిలీజ్ చేశారు.

Also Read : అయ్యర్ కు అందుకే అన్యాయం..? గంభీర్ పై ఫ్యాన్స్ ఫైర్

ఆగష్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. ఈ సందర్భంగా మెగా ఫ్యాన్స్‌కు సూపర్ గిఫ్ట్ ఇచ్చేందుకు విశ్వంభర దర్శక నిర్మాతలు సిద్దమయ్యారు. విశ్వంభర సినిమాకు సంబంధించిన ఓ వీడియో గ్లిప్స్‌ను ముందు రోజు సాయంత్రం 6 గంటలకు విడుదల చేస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వీడియో రిలీజ్ చేశారు. దీంతో విశ్వంభరపై వస్తున్న పుకార్లకు బ్రేక్ పెట్టినట్లు అయ్యింది. అయితే ఈ విశ్వంభర ఎలా ఉంటుందో అనే విషయంపై చిరంజీవి క్లారిటీ ఇచ్చేశారు.

Also Read : రష్యా సంచలన ప్రకటన.. భారత్ ఆయిల్ కొనడం ఆగదు..!

విశ్వంభర ఓ సోషియో ఫాంటసీ సినిమా అని ముందు నుంచే చెబుతున్నారు. విశ్వంభర ఎందుకు ఆలస్యమవుతుందని చాలా మందికి అనుమానాలున్నాయన్నారు చిరంజీవి. ఈ జాప్యం చాలా సముచితం అన్నారు. ఈ సినిమా సెంకడ్ ఆఫ్ మొత్తం వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ మీదే ఆధారపడి ఉందని.. అత్యున్నత ప్రమాణాలతో ఈ సినిమా అందించేందుకు దర్శక నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారని.. అందుకే ఆలస్యమవుతుందోన్నారు. ఈ సినిమా చక్కటి చందమామ కథలా సాగిపోతుందని.. చిన్న పిల్లలను ఎంతో ఆకట్టుకుంటుందని.. పెద్దవాళ్లను కూడా ఈ సినిమా అలరిస్తుందన్నారు చిరంజీవి. ఈ సినిమాను అందరూ ఎంజాయ్ చేసేలా వచ్చే ఏడాది సమ్మర్‌‌లో రిలీజ్ చేస్తున్నట్లు చిరంజీవి లీక్ చేశారు. దీంతో గ్లిమ్స్‌ కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్