Wednesday, February 4, 2026 09:59 PM
Wednesday, February 4, 2026 09:59 PM

జగన్‌కు వాళ్లు మాత్రమే సన్నిహితులా..?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరు ఇప్పుడు పార్టీ నేతలకు కూడా అర్థం కావటం లేదు. ఇందుకు ప్రధానంగా అధినేత జగన్ చేస్తున్న పనులే అంటున్నారు ఆ పార్టీ నేతలు. ఏపీలో వైసీపీ ఓడిన తర్వాత ఇప్పటి వరకు కేవలం పరామర్శలే తప్ప మరోటి చేయలేదు జగన్. వినుకొండతో మొదలుపెట్టి.. నెల్లూరు పర్యటన వరకు అన్నీ పరామర్శలే. విజయవాడ జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీ నుంచి నెల్లూరు సెంట్రల్ జైలులో ఉన్న కాకాణి గోవర్థన్ రెడ్డి వరకు జైలుకు వెళ్లడం.. వాళ్లను పరామర్శించడం.. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి.. కేసులు పెట్టిన పోలీసుల బట్టలూడదీస్తా అని వార్నింగ్ ఇవ్వటం.. ఇంతే తప్ప… ఏడాది కాలంలో జగన్ చేసింది ఏమీ లేదంటున్నారు సొంత పార్టీ నేతలు.

Also Read : ఆ విషయంలో వైసీపీ సెల్ఫ్ గోల్..!

వైసీపీ ఓడిన తర్వాత జగన్ తాడేపల్లి ప్యాలెస్‌ను ఖాళీ చేశారనేది పార్టీలో ప్రతి ఒక్కరికీ తెలుసు. వారానికి రెండు రోజులు బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చి వెళ్తున్నారు. దీంతో జగన్‌కు వర్క ఫ్రం బెంగళూరు లీడర్ అనే పేరు పెట్టారు టీడీపీ నేతలు. కొన్ని సందర్భాల్లో అయితే తాడేపల్లికి కూడా రాకుండానే.. వెళ్లిపోయారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మామిడి రైతుల పరామర్శకు అయితే నేరుగా బెంగళూరు నుంచి.. మళ్లీ బెంగళూరు వెళ్లిపోయారు తప్ప.. తాడేపల్లి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇక తాడేపల్లి వచ్చినా కూడా ఏదో పార్టీలో సామాన్య కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నేతలకు అందుబాటులో ఉండటం లేదు. తన చుట్టూ ఉండే ఆ నలుగురితోనే మాట్లాడుతున్నారు తప్ప.. మిగిలిన వారి వైపు కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇక మీడియా సమావేశాల్లో కూడా చెప్పాలనుకున్నది చెప్పేసి వెళ్లిపోతున్నారు.

Also Read : గుండెపోటు వస్తే అల్లం కాపాడుతుందా..?

ఇక ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో వైసీపీ కీలక నేతల అరెస్టు పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో కింగ్ పిన్ కోసం వేట కొనసాగుతోంది. ఇక ఇదే కేసులో ఇప్పటికే పోలీసులు 11 కోట్ల రూపాయలను కూడా హైదరాబాద్‌లోని ఓ ఫామ్ హౌస్‌లో స్వాధీనం చేసుకున్నారు. దీంతో కేసులో మరిన్ని అరెస్టులు ఖాయమనే మాట బాగా వినిపిస్తోంది. ఈ కేసు అక్రమమని… అసలు లేని అవినీతిని ఎక్కడి నుంచి చూపిస్తారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ధనుంజయ్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి అరెస్టు అక్రమమని పదే పదే ఆరోపిస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఓ విషయంపై వైసీపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లిక్కర్ కేసుపై ప్రెస్ మీట్‌లో కూడా అక్రమ కేసు అంటూ చెప్తున్న జగన్ మాత్రం.. ఆ కేసులో అరెస్టు అయ్యి జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న వారిని కనీసం పరామర్శించటం లేదు.

Also Read : బెంగళూరులో ఆల్ ఖైదా ఉగ్రవాది.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో కలిసి..!

కిడ్నాప్ కేసులో అరెస్టు అయిన వల్లభనేని వంశీ కోసం జైలుకు వెళ్లారు జగన్. అలాగే ఈవీఎం పగలగొట్టిన పిన్నెల్లి కోసం జైలుకు వెళ్లారు. తాజాగా మైనింగ్ కేసులో అరెస్టైన కాకాణి కోసం కూడా నెల్లూరు సెంట్రల్ జైలుకు వెళ్లారు. ఇక మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని దూషించిన నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని కూడా జగన్ పరామర్శించారు. కానీ.. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు అయిన వారిని జగన్ పట్టించుకోవటం లేదు.రాజ్ కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, బాలాజీ గోవిందప్పతో పాటు మాజీ సీఎం ఓఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డి, మాజీ ఐపీఎస్ ధనుంజయ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అలాగే రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. వీళ్లను ఇప్పటి వరకు జగన్ పరామర్శించలేదు. దీంతో వంశీకి, కాకాణికో న్యాయం.. చెవిరెడ్డి, మిథున్ రెడ్డికి ఓ న్యాయమా అని పార్టీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్