Thursday, February 5, 2026 07:05 AM
Thursday, February 5, 2026 07:05 AM

కలకలం రేపిన విష్ణు..!

కూటమి ప్రభుత్వంలో ఒక పార్టీతో మరో పార్టీ సయోధ్యగా లేవని, వేరు వేరు కుంపట్లు పెట్టుకున్నారని బీజేపీక మరోసారి స్పష్టం చేసింది. తెలుగుదేశం పార్టీ తమను చిన్న చూపు చూస్తోందని బీజేపీ శాసన సభా పక్ష నాయకుడు పెనుమత్స విష్ణుకుమార్ రాజు తెగేసి చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రమాణ స్వీకారోత్సవంలో విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 5 శాతం సీట్లు కేటాయిస్తే సరిపోతుందని టీడీపీ చెప్పడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడిన నాయకులకు న్యాయం చేయాలని.. కూటమిలో బీజేపీకి తగిన వాటా రావాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడమే కాక, కూటమి రాజకీయాల్లో బీజేపీ ఆశలు, అసంతృప్తులను బహిర్గతం చేశాయి.

Also Read : విలువలు, విశ్వసనీయతలో ఎప్పుడూ రాజీపదలేదన్న జగన్ వ్యాఖ్యలతో మీరు ఏకీభవిస్తున్నారా?

విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు కేవలం సీట్ల కేటాయింపునకు సంబంధించినవి మాత్రమే కాదు. అవి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ రాజకీయ స్థానం కూడా. కూటమిలో బీజేపీ ప్రాముఖ్యతను బలోపేతం చేయాలనే ఆకాంక్షను సూచిస్తాయి. 2024 శాసనసభ ఎన్నికల్లో 10 సీట్లలో పోటీ చేసిన బీజేపీ 8 సీట్లు గెలుచుకుని భారీ విజయాన్ని సాధించింది. అయితే కూటమి భాగస్వామి అయిన టీడీపీ 144 సీట్లలో 135 సీట్లు గెలిచింది. ఈ విజయం బీజేపీకి రాష్ట్రంలో తన ప్రభావాన్ని పెంచుకునే అవకాశాన్ని ఇచ్చినప్పటికీ, సీట్ల కేటాయింపులో టీడీపీ ఆధిపత్యం బీజేపీ నాయకుల్లో అసంతృప్తిని రేకెత్తించింది. బీజేపీ ప్రాబల్యం విస్తరించకుండా ఉన్న చోటే కుదించుకుని ఉండేలా చేసే విధంగా టీడీపీ ధోరణి ఉందని గుసగుసలు వినబడుతున్నాయి.

లోకల్ బాడీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైనవి. ఎందుకంటే అవి గ్రామీణ, పట్టణ స్థాయిలో పార్టీ బలాన్ని ప్రదర్శించే అవకాశాన్ని ఇస్తాయి. పార్టీకి క్యాడర్ అందించేది గ్రామాలే. ఇలాంటప్పుడు పార్టీ ఉనికి పెరిగేందుకు బీజేపీ చర్యలు తీసుకుంటుంది. కానీ టీడీపీ చర్య దీనికి అనుకూలంగా లేదు. బీజేపీ రాష్ట్రంలో తన స్వతంత్ర ఉనికిని బలోపేతం చేసుకోవాలనే లక్ష్యాన్ని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు సూచిస్తాయి. “దశాబ్దాలుగా పార్టీ జెండా మోసిన వారికి న్యాయం చేయాలి” అనే వాదన బీజేపీ కార్యకర్తలు, నాయకులకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్‌ను స్పష్టం చేస్తుంది.

Also Read : మాగుంటను ముంచేసిన కాకాని..?

పీవీఎన్ మాధవ్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం ఈ వ్యాఖ్యలకు కీలకమైన నేపథ్యం. మాధవ్ బీజేపీ యువజన విభాగం నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, ఆర్ఎస్ఎస్‌తో దగ్గరి సంబంధాలు పెంచుకున్న నాయకుడిగా గుర్తింపు పొందారు. మాధవ్ నియామకం ఏపీలో బీజేపీ తన సంస్థాగత బలాన్ని పెంచడానికి, ముఖ్యంగా బీసీ ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకోవడానికి ఒక వ్యూహాత్మక చర్యగా అనిపిస్తోంది. విష్ణుకుమార్ రాజు చేసిన వ్యాఖ్యలు, మాధవ్ నాయకత్వంలో బీజేపీ, టీడీపీతో సీట్ల పంపకంలో గట్టిగా బేరం ఆడాలనే సంకేతాన్ని ఇస్తున్నాయి. ఇది సాధ్యమా? మాధవ్ అలా పట్టుపట్టే స్థితిలో ఉన్నారు. ఒక విధంగా పార్టీ నాయకత్వ పగ్గాలు చేపట్టగానే మాధవ్‌కు ఎదురవుతున్న పెద్ద పరీక్ష ఇది.

Also Read : దుబారాలో పరాకాష్ట.. ఇదేందయ్యా..!

దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నప్పుడు విష్ణుకుమార్ రాజు ఇలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం గమనార్హం. పురందేశ్వరి ఎన్టీ రామారావు కుమార్తె. చంద్రబాబు నాయుడు వదిన కావడం వల్ల టీడీపీ – బీజేపీ కూటమిలో సమన్వయం సాఫీగా సాగింది. ఆమెను ప్రశ్నించే సాహసం కాని, ఆమెను ఇరుకున పెట్టే ప్రకటనలు గానీ ఎవ్వరూ చేయలేదు. పురందేశ్వరి నాయకత్వంలో బీజేపీ, టీడీపీతో సీట్ల పంపకంలో ఎక్కువగా పట్టుబట్టడం కంటే, చక్కగా రాజీపడినట్లు కనిపిస్తుంది. అయితే మాధవ్ నియామకం తర్వాత రాష్ట్రంలో బీజేపీ తన స్వతంత్ర ఉనికిని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో విష్ణుకుమార్ రాజు వంటి నాయకులు బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

Also Read : ముందు ఆ విషయం పై క్లారిటీ ఏదీ..?

పురందేశ్వరి చంద్రబాబుకు వదిన కావడం, బీజేపీ – టీడీపీ మధ్య సీట్ల పంపకంలో ఒక సమతుల్యతను నిర్వహించడంలో సహాయపడింది. అయితే ఈ బంధుత్వం కొన్ని సందర్భాల్లో బీజేపీ లోపల అసంతృప్తిని కలిగించినట్లు కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ నాయకులు టీడీపీ ఆధిపత్యాన్ని అంగీకరించాల్సి వచ్చింది. “కూటమిలో బీజేపీ లేకపోతే చంద్రబాబు సీఎం కాలేరు” అని విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యానించడం, బీజేపీ రాజకీయ ప్రాముఖ్యతను గుర్తు చేసే ప్రయత్నమే. మాధవ్ నాయకత్వంలో రాష్ట్రంలో బీజేపీ తన సంస్థాగత బలాన్ని, ముఖ్యంగా బీసీ ఓటు బ్యాంకును లక్ష్యంగా చేసుకుని తన ప్రభావాన్ని పెంచాలని చూస్తోంది. లోకల్ బాడీ ఎన్నికలు ఈ వ్యూహంలో కీలకమైనవి. ఎందుకంటే అవి గ్రామీణ స్థాయిలో బీజేపీ బలాన్ని నిరూపించే అవకాశాన్ని ఇస్తాయి.

విష్ణుకుమార్ రాజు వ్యాఖ్యలు టీడీపీతో సీట్ల పంపకంలో గట్టిగా బేరం ఆడాలనే బీజేపీ ఉద్దేశాన్ని సూచిస్తాయి. “అవసరమైతే తెగదెంపులు” అనే సూచన, కూటమి లోపల బీజేపీ తన స్థానాన్ని బలోపేతం చేయడానికి ఒత్తిడి వ్యూహాన్ని అవలంబిస్తుందని సంకేతం ఇస్తుంది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడం ద్వారా, బీజేపీ తన రాజకీయ సందేశాన్ని విస్తృత ప్రేక్షకులకు చేరవేయడంలో విజయం సాధించింది. ఇది బీజేపీ కార్యకర్తలలో ఉత్సాహాన్ని రేకెత్తించడమే కాక, టీడీపీ నాయకత్వంపై ఒత్తిడిని పెంచింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్