Wednesday, February 4, 2026 07:37 PM
Wednesday, February 4, 2026 07:37 PM

ఎవరీ ధనుంజయ రెడ్డి.. జగన్ తో ఏమా బంధం..?

ధనుంజయ్ రెడ్డి.. ఎవరీయన.. ఓ మాజీ ఐఏఎస్ గురించి ఎందుకింత చర్చ నడుస్తోంది. ఐఏఎస్ అధికారులు అరెస్టు అవ్వడం కామన్.. ఇప్పటికే ఎంతో మంది మీద కేసులున్నాయి. చాలా మంది అరెస్టు కూడా అయ్యారు. మరి ధనుంజయ్ రెడ్డి అరెస్టుతో ఎందుకింత కంగారు. ఎందుకు కొంత మంది బెంబేలెత్తిపోతున్నారు. వైసీపీకి చెందిన నేతలంతా పోలోమని జిల్లా కోర్టుకు వచ్చి మరీ ఎందుకు పరామర్శించారు. వైసీపీ నేతలంతా వరుస ప్రెస్ మీట్లు పెట్టి మరీ ధనుంజయ్ రెడ్డి అమాయకుడంటూ ఎందుకు ఇంతగా గగ్గొలు పెడుతున్నారు. బాబోయ్.. ఒక్క అరెస్టు ఇన్ని ప్రశ్నలా.. అసలు ఎవరీ ధనంజయ రెడ్డి..

Also Read : మాన్షన్‌ హౌస్‌ ను టార్చర్ చేసిన కసిరెడ్డి..?

ఏపీలో లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణ వేగవంతం అయ్యింది. వైసీపీ ప్రభుత్వంలో సీఎంఓ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డిలను సిట్ అధికారులు అరెస్టు చేశారు. వాళ్లిద్దరినీ తమ కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోరుతున్నారు. దీంతో అందరి దృష్టి ధనుంజయ రెడ్డిపై పడింది. లిక్కర్ స్కామ్‌లో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి విచారణకు సహకరించలేదని.. వాళ్లిద్దరి నుంచి మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని సిట్ అధికారులు వారం రోజులు విచారణకు అనుమతించాలంటూ ఇప్పటికే కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు కూడా. అయితే కృష్ణమోహన్ రెడ్డి కంటే కూడా ధనుంజయ రెడ్డి విషయంలోనే వైసీపీ నేతలు తెగ చర్చించుకుంటున్నారు. ధనుంజయ రెడ్డి నోరు విప్పితే తమ అన్న నేరుగా జైలుకు పోవడం ఖాయమంటున్నారు కూడా. ఇందుకు ప్రధాన కారణం.. వైసీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే.. ధనుంజయరెడ్డి షాడో సీఎం.

Also Read : ఐఎస్ఐ ఏజెంట్ల నిలయంగా నార్త్ ఇండియా

వైఎస్ కుటుంబానికి ధనుంజయ రెడ్డి వీరవిధేయుడు. ఉమ్మడి కడప జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కపల్లెకు చెందిన ధనుంజయరెడ్డి 1988లో తొలిసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశీస్సులతో తొలిసారి పంచాయతీ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత నుంచి ధనుంజయరెడ్డి వైఎస్ కుటుంబానికి నమ్మినబంటుగా మారిపోయారు. వైఎస్ కుటుంబం నంది అంటే నంది.. పంది అంటే పంది.. అనేలా ధనుంజయరెడ్డి వ్యవహరించారు. చెన్నముక్కపల్లె సర్పంచ్‌గా పనిచేస్తూనే డానిక్స్ సర్వీసుకు ఎంపికయ్యారు ధనుంజయ. ఢిల్లీలో ఉన్నప్పటికీ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో తన సంబంధాలు కొనసాగించారు. ఇంకా చెప్పాలంటే వైఎస్ ఆర్థిక లావాదేవీలను కూడా ధనుంజయ రెడ్డి స్వయంగా చూసేవారనేది బహిరంగ రహస్యం.

Also Read : ఉమాకు ఖాయమే..? అధిష్టానం క్లారిటీ..?

2004 వరకు ఢిల్లీలోనే ఉంటూ వైఎస్ఆర్‌కు సహకారం అందించిన ధనుంజయ రెడ్డి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రమాణం చేసిన వెంటనే ఏపీకి డిప్యూటేషన్‌పై వచ్చేశారు. దాదాపు 8 ఏళ్ల పాటు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లో డిప్యూటీ కమిషనర్‌గా పని చేశారు. తర్వాత రాష్ట్ర సర్వీసులో విలీనం చేసుకున్నారు నాటి ప్రభుత్వ పెద్దలు. 8 ఏళ్లు డిప్యూటీ డైరెక్టర్ హోదా పోస్టులో పని చేస్తే ఐఏఎస్‌గా ఎంపిక చేయవచ్చన్న క్లాజ్‌తో ధనుంజయరెడ్డి పదోన్నతి పొందారు.

Also Read : టార్గెట్ భారత్ ఏజెంట్లు.. జ్యోతి విచారణలో సంచలనాలు

ఇక రాష్ట్ర విభజన తర్వాత అనూహ్యంగా ఏపీకి బదిలీ అయ్యారు ధనుంజయరెడ్డి. 2014-19 మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కూడా పలు కీలక హోదాల్లో విధులు నిర్వహించారు ధనుంజయరెడ్డి. అయితే పని చేసేది ప్రభుత్వానికి.. పని చేస్తుంది మాత్రం వైసీపీ కోసం అనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా, వ్యవసాయ శాఖ కమిషనర్‌గా, విపత్తుల నిర్వహణ శాఖ డైరెక్టర్‌గా, ఎన్‌టీఆర్ వైద్య సేవ సీఈవో, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, ఏపీటీడీసీ ఎండీ వంటి కీలక బాధ్యతలను నాటి చంద్రబాబు ప్రభుత్వం ధనుంజయరెడ్డికి అప్పగించింది. ఈయన హయాంలోనే గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగింది. ఎన్‌టీఆర్ వైద్య సేవ సీఈవోగా ఆసుపత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించడంలో నిర్లక్ష్యం చూపారనే ఆరోపణలు. ఇక పర్యాటక రంగం అభివృద్ధికి ఎండీగా ధనుంజయ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆ శాఖ ఉద్యోగులే చెబుతున్నారు కూడా. ఇన్ని కీలక బాధ్యతలు నిర్వహించినప్పటికీ.. ఎక్కడా తాను వైఎస్ మనిషి అనే అనుమానం రాకుండా వ్యవహరించారు ధనుంజయరెడ్డి.

Also Read : దుమ్ము రేపిన మ్యాన్ ఆఫ్ ది మాసేస్

ఇక ప్రధానంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌ రాజకీయ ప్రత్యర్థుల ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడం, కేసులు పెట్టించి అరెస్టులు చేయించడంలో ధనుంజయ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారనే టాక్ ఉంది. కొందరు టీడీపీ నాయకుల్ని అరెస్ట్‌ చేసి.. వివిధ స్టేషన్లకు తిప్పడం, కస్టడీలో చిత్రహింసలు పెట్టడం వంటి వ్యవహారాల్ని ఆయన స్వయంగా పర్యవేక్షించేవారనే ఆరోపణలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర్రావును జగన్‌తో కలవకుండా చేశారు. తనను ఎందుకు సస్పెండ్ చేశారో తెలుసుకునేందుకు జగన్ అపాయింట్‌మెంట్ అడిగినా కూడా ధనుంజయరెడ్డి అనుమంతించలేదని ఏబీవీ స్వయంగా ఆరోపించారు.

Also Read : ఫ్యాన్స్‌కు షాక్ ఇస్తున్న ధోనీ.. షాకింగ్ డెసిషన్..?

రాజకీయంగా కూడా జగన్‌ తరఫున వ్యవహారాలూ ధనుంజయ రెడ్డి చక్కబెట్టేవారనే ప్రచారం జరిగింది. ఎమ్మెల్యేల పనితీరునూ ఆయనే సమీక్షించేవారని చెబుతుంటారు. జగన్‌ను ఎవరు కలవాలన్నా.. ముందు ధనుంజయ రెడ్డి అనుమతి తప్పనిసరి అనే ప్రచారమూ ఉంది. 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ఎంపికలోనూ ధనుంజయ రెడ్డి కీలకంగా వ్యవహరించారని చెబుతారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పార్టీలో చాలా నియోజకవర్గాల్లో అంతర్గత విబేధాలు ఉండేవి. వాటి గురించి మాట్లాడటానికి జగన్ దగ్గరకు వెళ్తే.. ‘ధనుంజయ్‌ అన్న’ను కలిసి మాట్లాడండని ఆయన చెప్పేవారని వైసీపీ నేతలే చెబుతుంటారు. ఇదే విషయంలో ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ధనుంజయ్ రెడ్డి సీఎంగా వ్యవహరించారని ఆరోపించారు. ఒక సందర్భంలో వారం రోజుల పాటు తనకు కనీసం కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని కోటంరెడ్డి ఆరోపించారు. చివరికి స్వయంగా కలిసేందుకు సీఎం క్యాంపు ఆఫీసుకు అధికార పార్టీ ఎమ్మెల్యే హోదాలో వెళితే.. ఉదయం 10 గంటలకు ధనుంజయ రెడ్డి ఆఫీసుకు వెళితే.. రాత్రి 8 గంటలకు లోపలికి పిలిచారని వెల్లడించారు. ఎవడీ ధనుంజయ్ రెడ్డి అని ఆగ్రహం వ్యక్తం చేసిన కోటంరెడ్డి.. ఏరోజైనా పార్టీ జెండా మోశాడా అని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యేలను గడ్డిపోచల్లా చూసేవాడని ఆరోపించారు.

Also Read : జనసేన కూడా గేట్లు మూసివేసిందా..? కారణం ఇదేనా..?

ఉమ్మడి అనంతపురం జిల్లాలకు చెందిన వైసీపీ సీనియర్ నేత.. ఓసారి ధనుంజయ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ప్రచారం జరిగింది. అదే సమయంలో రాజకీయం గురించి ధనుంజయ రెడ్డికి చెప్పమనడం ఏంటని.. ఆయన జగన్‌ను కూడా నిలదీసినట్టు ప్రచారం జరిగింది. ఇలా చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ధనుంజయ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. “అన్ని విషయాల్లో ధనుంజయ రెడ్డి అతిగా జోక్యం చేసుకునేవారని.. ఆయనది రాయలసీమే అయినా.. ఫ్యాక్షన్ రాజకీయాల గురించి ఆయనకు తెలియదని ఓ నేత విమర్శించారు. పార్టీలో వర్గపోరు నష్టం చేస్తుందని జగన్‌కు చెప్పడానికి వెళ్లితే.. ఆయన ధనుంజయన్నకు చెప్పాలని సూచించారు. ఆ అవసరం నాకు లేదని.. ధనుంజయ రెడ్డిని కలవకుండానే వచ్చానన్నారు. ఎన్నికల్లో తాను ఊహించినట్టుగానే అనంతపురం జిల్లాలో వైసీపీకి కనీసం ఒక్క సీటు కూడా రాలేదంటున్నారు ఆ పార్టీకి చెందిన నేత ఒకరు.

Also Read : పవన్ ప్లానింగ్ అదుర్స్.. త్వరలో మరో కార్యక్రమం

ధనుంజయ రెడ్డిని జగన్ బాగా నమ్మారు. ప్రభుత్వ అవసరాల కోసం ఆయనకు పనులు అప్పగించినా.. పార్టీ పరమైన విషయాలు జగన్ వింటే బాగుండేది. కానీ అలా జరగలేదు. ఇదే విషయాన్ని చాలా సందర్భాల్లో స్వయంగా చెప్పినా కూడా జగన్ ఏ మాత్రం పట్టించుకోలేదని మాజీ ఎమ్మెల్యే ఒకరు విమర్శించారు. దాని ఫలితం ఎన్నికల్లో కనిపించింది. ధనుంజయ రెడ్డి కూడా జగన్‌కు వైసీపీ నేతలను దూరం చేశారు. ఇది పార్టీలో అందరికీ తెలుసు. అయితే ధనుంజయ రెడ్డిని జగన్ ఇంత గుడ్డిగా నమ్మడానికి ఏకైక కారణం.. ఆర్థిక లావాదేవీలు మాత్రమే అనేది బహిరంగ రహస్యం. లిక్కర్ స్కామ్ అంతా ధనుంజయ రెడ్డి అండర్‌లోనే జరిగిందని పార్టీకి రాజీనామా చేసిన నేతలు చెబుతున్నారు. ఆ సొమ్ము ప్యాలెస్‌కు ఎలా చేరాలో.. ఆ తర్వాత ఏం చేయాలో ధనుంజయ రెడ్డి సూచించారనేది ప్రధాన ఆరోపణ. అందుకే ధనుంజయ రెడ్డి అరెస్టు తర్వాత వైసీపీ నేతలంతా తర్వాత ఎవరికి నోటీసులు వస్తాయి.. ఎవరిని అరెస్టు చేస్తారని చర్చించుకుంటున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుంటూరు కారమా.. మజాకానా…!

గుంటూరు కారం పవర్ ఇన్నాళ్లకు కన్పించింది.....

బాబు-పవన్ భేటీ.. ఆ...

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

చంద్రబాబు సలహదారుగా మళ్లీ...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్...

అందరికీ తలో రోగం.....

ఏపీ సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల...

తెలంగాణా సైనికులకు జనసేనాని...

తెలంగాణాలో మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడుతున్న...

నాటుకోడి రేట్ ఎక్కువగా...

గ్రామాల్లో ఉండే పంచాయితీ సభల నుంచి...

పోల్స్