Wednesday, August 5, 2026 08:12 AM
Wednesday, August 5, 2026 08:12 AM

జనసేన కూడా గేట్లు మూసివేసిందా..? కారణం ఇదేనా..?

ఏపీలో జనసేన పార్టీ 2024 లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి నాయకులను బయటకు లాగే కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. వైసీపీలో కీలకంగా ఉన్న నాయకులకు గాలం వేసి తమ పార్టీలో జాయిన్ చేసుకునేందుకు పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపించారు. ఇందులో ప్రధానంగా ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులు పైనే ఆయన దృష్టి పెట్టారు. అనుకున్న విధంగానే కొంతమంది ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలోనే మరి కొంతమంది నాయకులు కూడా ఆ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందనే ప్రచారం గట్టిగా జరిగింది.

Also Read : టార్గెట్ భారత్ ఏజెంట్లు.. జ్యోతి విచారణలో సంచలనాలు

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారి వెంకట రోశయ్య, సామినేని ఉదయభాను వంటి వారు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత మరో 10 మంది మాజీ ఎమ్మెల్యేలు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడానికి రెడీ అవుతున్నారు అనే వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి పార్టీ అధిష్టానం జిల్లాల్లో ఉన్న నాయకత్వాన్ని అలాగే టిడిపిని ఒప్పించింది అనే ప్రచారం సైతం జరిగింది. కానీ క్రమంగా జనసేన పార్టీలో చేరికలు ఆగిపోయాయి. వైసీపీలో అసంతృప్తిగా ఉన్నవాళ్లు సైలెంట్ గా ఉండిపోయారు. ఆ పార్టీకి రాజీనామా చేయడమే గాని మరో పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

Also Read : ముంబైలో అంతా సెట్ చేసిన నానీ..? టీడీపీ ఆరోపణ నిజమేనా..?

కొంతమంది రాజ్యసభ ఎంపీలు టిడిపిలో జాయిన్ అయ్యారు. కొంతమంది ఎమ్మెల్సీలు మాత్రం సైలెంట్ గానే తమ పదవులకు రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గ రాజకీయాల మీద పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. టిడిపి గేట్లు వేయడంతో జనసేన పార్టీ వైపు అడుగులు వేసిన నాయకులు ఇప్పుడు మళ్లీ సైలెంట్ కావడానికి కారణం ఏంటి అనేది స్పష్టత రావడం లేదు. అయితే టిడిపి నాయకత్వ వ్యతిరేకత కారణంగానే వాళ్ళందరూ సైలెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది. జగ్గయ్యపేట నియోజకవర్గంలో వాతావరణం బాగానే ఉన్నా ఒంగోలు తో పాటుగా పొన్నూరులో వాతావరణం అంతగా అనుకూలంగా లేదని సమాచారం. ఈ పరిస్థితులు గమనించిన రెండు పార్టీలు అధిష్టానాలు చేరికలను ఆపినట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్