Saturday, September 19, 2026 03:31 PM
Saturday, September 19, 2026 03:31 PM

ముంబైలో అంతా సెట్ చేసిన నానీ..? టీడీపీ ఆరోపణ నిజమేనా..?

వైసిపి కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నాని మరోసారి సోషల్ మీడియాలో హీట్ పెంచేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టిడిపి అధిష్టానాన్ని అత్యంత దారుణంగా మాట్లాడిన నాని.. ప్రస్తుతం సైలెంట్ గా ఉన్నారు. వైసిపి హయాంలో ఆయన అండ చూసుకుని మరికొంతమంది చెలరేగిపోయి వాళ్లు ప్రస్తుతం జైల్లో ఉన్నారు. అందులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ముందు వరసలో ఉంటారు. మరి వల్లభనేని వంశీని అరెస్టు చేసిన తర్వాత కొడాలి నానిని ఎప్పుడు అరెస్టు చేయవచ్చు అనే దానిపై క్లారిటీ రావడం లేదు.

Also Read : బాలయ్య ఫ్యాన్స్ కు క్రేజీ అప్డేట్

కానీ తాజాగా వస్తున్న అప్డేట్ ప్రకారం కొడాలి నానిని అరెస్టు చేయవచ్చు అనే వార్త బయటకు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న నాని విదేశాలకు పారిపోయే ప్లాన్ లో ఉన్నారు అనే వార్తలు వినపడుతున్నాయి. ఇటీవల టిడిపి నాయకులు కొడాలి నాని పై ఇదే విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అనారోగ్యం కారణంగా రెండు నెలల నుంచి కొడాలి నాని చికిత్స పొందుతున్నారు. గుండె సంబంధిత సమస్యల కారణంగా ఆయనకు ముంబైలో ఓ ఆపరేషన్ కూడా జరిగింది. ఇక అక్కడి నుంచి కొడాలి నాని మీడియాలో పెద్దగా కనపడలేదు.

Also Read : లోకేష్ ఢిల్లీ టూర్.. మోడీ చేతిలో కీలక ఆధారాలు..?

ఇటీవల ఆయనకు సంబంధించిన కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు టిడిపి నేతలు చేస్తున్న విమర్శలు ప్రకారం నాని వైద్యం పేరుతో అమెరికా వెళ్ళిపోయే ఆలోచనలో ఉన్నారు అనే ప్రచారం మొదలైంది. దీనికి సంబంధించి వైద్యుల నుంచి సర్టిఫికెట్ కూడా తీసుకునేందుకు నాని విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. గుండెతో పాటుగా నానికి లివర్ సమస్యలు కూడా ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించి విదేశాల్లో చికిత్స తీసుకునేందుకు నాని.. ముంబై వైద్యుల నుంచి ఓ సర్టిఫికెట్ తీసుకోవడానికి సిద్ధమయ్యారట.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్