Wednesday, August 5, 2026 11:11 AM
Wednesday, August 5, 2026 11:11 AM

నేను, పవన్, మోదీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం

టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యవర్గ సభ్యులతో ఆ పార్టీ అధినేత, సిఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మే 18 నాటికి రాష్ట్ర కమిటీలు మినహా అన్ని కమిటీలు పూర్తి చేయాలని ఆదేశించారు చంద్రబాబు. కడపలో 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. మిగిలిన నామినేటెడ్ పదవులు త్వరలోనే భర్తీ చేస్తామన్న సీఎం చంద్రబాబు.. రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమం విజయవంతంలో కార్యకర్తల కృషి అభినందనీయమని కొనియాడారు.

Also Read : అరెస్ట్ చేసేయండి.. లిక్కర్ స్కాంలో సుప్రీం షాక్

ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం చేసినా వైసీపీ చౌకబారు విమర్శలు చేస్తోంది..తిప్పికొట్టండని శ్రేణులకు సూచించారు. అమరావతి రాజధాని పనుల పున:ప్రారంభ కార్యక్రమం చాలా బాగా జరిగిందని హర్షం వ్యక్తం చేసారు. సభ విజయవంతానికి కృషి చేసిన కార్యకర్తలు, నేతలందరినీ అభినందిస్తున్నాను అన్నారు. రాష్ట్రానికి గతంలో ప్రధాని నరేంద్రమోదీ వచ్చినప్పటికీ ఈసారి అన్నింటినీ మరిపించేలా ఈ సభ జరిగిందన్నారు. రాజధాని పనుల పున:ప్రారంభం కార్యక్రమంతో దేశం, ప్రపంచం దృష్టి అమరావతిపై మళ్లిందని పేర్కొన్నారు.

Also Read : పెద్దిరెడ్డిని కాపాడుతున్న అధికారులు

ప్రజలు ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి సభకు వచ్చి వెళ్లేదాకా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని.. అమరావతి ఆవశ్యకతను తెలియజేసేందుకు, పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రధాని చేతుల మీదుగా పున:ప్రారంభం చేశామని పేర్కొన్నారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం ఇక ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తుంది. 5 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవానికి అమరావతి ప్రతీక అన్నారు చంద్రబాబు. యువతకు అవకాశాలు, ఉద్యోగాలు కల్పించే విశ్వనగరంగా అమరావతి రూపుదిద్దుకుంటుందని, ఎన్నికల సమయంలో రాష్ట్రాన్ని పున:నిర్మాణం చేస్తామని ప్రధాని మోదీ, నేను, పవన్ కళ్యాణ్ చెప్పామన్నారు.

Also Read : ఎవరిని వదలం.. మోదీ స్ట్రాంగ్ వార్నింగ్

చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చాక గతి తప్పిన రాష్ట్రాన్ని గాడినపెట్టాం. పోలవరానికి నిధులు రాబట్టి 2027 నాటికి పూర్తి చేసే లక్ష్యంతో పని చేస్తున్నామని స్పష్టం చేసారు. మూతబడే స్థితిలో ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు ఊపిరిపోసి రూ.11,400 కోట్లు కేంద్రం నిధులు కేటాయించేలా చేసుకున్నాం. ఉత్తరాంధ్ర వాసుల కల అయిన రైల్వేజోన్ సాధించామన్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం. బీపీసీఎల్, ఆర్సెలార్ మిట్టల్, సీమలో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్స్, ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్