Wednesday, August 5, 2026 07:53 AM
Wednesday, August 5, 2026 07:53 AM

అరెస్ట్ చేసేయండి.. లిక్కర్ స్కాంలో సుప్రీం షాక్

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో రోజురోజుకి సంచలనాలు నమోదు అవుతున్నాయి. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందం ఎవరిని అరెస్టు చేయవచ్చు అనే దానిపై ఎన్నో ఊహాగానాలు వినపడుతున్నాయి. కొంత మంది కీలక వ్యక్తులను అరెస్టు చేసే అవకాశం ఉందనే ప్రచారం సైతం జరుగుతుంది. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మద్యం కుంభకోణంలో కీలక నిందితుడు అయినా సరే, అతని వద్ద నుంచి ముడుపులు కొంతమంది పెద్దలకు వెళ్లాయి అనే అంశాన్ని దర్యాప్తు బృందం గుర్తించింది.

Also Read : తమ్ముడిపై కేశినేని నానీ మరో బాంబు 

దీనితో అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన కొంతమంది అధికారుల చుట్టూ కూడా ఉచ్చు బిగిస్తోంది. తాజాగా ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. మద్యం కుంభకోణంలో అత్యంత కీలకంగా భావిస్తున్న నిందితులకు.. సుప్రీంకోర్టులో గట్టి షాక్ తగిలింది. వైయస్ జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, వైయస్ భారతి వ్యాపారాలను చూసే బాలాజీ గోవిందప్ప కు మద్యంతర ఉపశమనం ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏడవ తేదీన విచారణ ఉన్న నేపథ్యంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

Also Read : బ్యాటింగ్ ఓకే.. బౌలింగ్ పైనే ప్రశ్నలన్నీ

చట్టపరంగా ముగ్గురిని అరెస్టు చేయవచ్చని పేర్కొంది. తదుపరి విచారణ ఎనిమిదో తేదీకి వాయిదా వేసింది. అదే రోజు రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి బెయిల్ పై కూడా విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు తాజాగా స్పష్టం చేసింది. ఈ లిక్కర్ స్కామ్ లో వీళ్ళ ముగ్గురు అత్యంత కీలకంగా కావడంతో.. వీళ్లను అరెస్టు చేస్తే ఎవరి పేర్లు బయటికి వస్తాయనేదే ఇప్పుడు ఆసక్తిని రేపుతున్న అంశం. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం దాదాపు నాలుగు రోజుల నుంచి విచారిస్తున్న నేపథ్యంలో.. ఏం జరగబోతుంది, ఎవరి పేర్లు బయటకు వస్తాయి అనేది చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్