ప్రపంచవ్యాప్తంగా పెంపుడు జంతువుల్లో కుక్కకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. మనదేశంలో కూడా ఖరీదైన కుక్క జాతులు ఎన్నో ఉన్నాయి. కుక్కల మీద మక్కువ ఎక్కువగా ఉన్నవాళ్లు విదేశాల నుంచి దిగుమతి కూడా చేసుకుంటారు. విదేశాల్లో ఉండే అరుదైన జాతులను ఇక్కడ ఉండే ప్రముఖ వ్యాపారవేత్తలు సినిమా ప్రముఖులు అలాగే రాజకీయ ప్రముఖులు కొంటూ ఉంటారు. కుక్కలను ఇంట్లో మనిషి కంటే ఎక్కువగా ప్రేమించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. వాటితో ఎటువంటి మానసిక సమస్యలు ఉండకపోగా మానసిక ఉల్లాసానికి కుక్కలు లేదంటే పిల్లలు ఎంతగానో ఉపయోగపడుతుంటాయి.
Also Read : రేవంత్ అనవసరంగా నోరు జారారా…?
దీనితో కుక్కల విషయంలో ఎంత ఖరీదైన సరే కొనేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో విదేశాల నుంచి ఎక్కువగా కుక్కలను దిగుమతి చేసుకుంటున్నారు. కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసే కుక్కల సంఖ్య ఎక్కువగానే ఉంది. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి కుక్కను ఏకంగా 50 కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేశాడు. బెంగళూరులో నివాసం ఉండే సతీష్ అనే వ్యక్తి అమెరికా నుంచి 50 కోట్లు ఖర్చుపెట్టి ఒక కుక్కను దిగుమతి చేసుకున్నాడు.
Also Read : ఇంకులేని పెన్ను.. తాటిపర్తికి స్ట్రాంగ్ కౌంటర్..!
కాడాబాంబ్ ఒకామి అనే అరుదైన వోల్ఫ్ డాగ్ ను 5.7 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశాడు. అంటే భారత కరెన్సీలో దాదాపు 50 కోట్ల రూపాయలు అన్నమాట. దీనిపై మాట్లాడిన సతీష్.. తనకు కుక్కలు ఉంటే చాలా ఇష్టమని అందుకే దీనిని కొనుగోలు చేయడానికి అంత ఖర్చుపెట్టినట్లు చెప్పుకొచ్చాడు. అరుదైన అలాగే ప్రత్యేకమైన కుక్కలను భారతదేశానికి పరిచయం చేయడం తనకు ఎంతో ఇష్టమని అన్నాడు. ఈ కుక్క అమెరికాలో పుట్టిందని దాని వయసు 8 నెలలు అని, ప్రతిరోజు అది మూడు కేజీల పచ్చి మాంసం తింటుందని వివరించాడు. ఆ కుక్క కోసం తన ఇంటి వద్ద ప్రత్యేక సదుపాయాలు కూడా ఏర్పాటు చేశానని.. ఇక్కడి వాతావరణానికి అది అలవాటు పడే వరకు ప్రత్యేక వైద్యులు దానిని పర్యవేక్షిస్తూ ఉంటారని చెప్పుకొచ్చాడు.

