Sunday, March 22, 2026 07:24 AM
Sunday, March 22, 2026 07:24 AM

పిల్లను ఇచ్చా అంతే.. జగన్ పై సాయి రెడ్డి సంచలనం

రాజకీయాలకు విజయసాయి రెడ్డి గుడ్ బై చెప్పినా.. గతంలో చేసిన తప్పులు ఆయనను వెంటాడుతున్నాయి. తాజాగా ఓ కీలక కేసులో విజయసాయి రెడ్డిని విచారణకు పిలిచారు అధికారులు. విజయవాడ సీపీ కార్యాలయంలో ఆయనను విచారించారు. దాదాపు 3 గంటల పాటు సాగిన ఈ విచారణలో విజయసాయి కీలక విషయాలను ప్రస్తావించినట్టు సమాచారం. కాకినాడ సి పోర్ట్ లో వాటాలను తాను లాక్కోలేదనే విషయాన్ని విజయసాయి చెప్పారట. ఇక ఈ వ్యవహారంలో వైవీ సుబ్బారెడ్డి కొడుకుని ఇరికించినట్టు తెలుస్తోంది.

Also Read : లొంగిపోయిన బోరుగడ్డ.. పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఇదే

కెవి రావుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్పానని.. కేవీరావుతో ముఖపరిచయం తప్ప ఎలాంటి ఆర్థిక సంబంధాలు లేవని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. అరబిందో వ్యాపారాల్లోనూ నేను ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేసారు. విక్రాంత్‌రెడ్డి తెలుసా అని అడిగారని… సుబ్బారెడ్డి కుమారుడిగా తెలుసు అని చెప్పానన్నారు. నేను విక్రాంత్‌రెడ్డిని కేవీరావుకు పరిచయం చేయాల్సిన అవసరం లేదని విరిగిన మనస్సు మళ్లీ అతుక్కోదు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఆయన మనసులో స్థానం లేదనే రాజకీయాలు వదిలేశాను అన్నారు.

Also Read : దారుణం.. 150 మందిని హత్య చేసిన హైజాకర్స్..!

జగన్ కోటరీలో ఇరుక్కుపోయారు… ఆయన కోటరీ నుంచి బయటకు రావాలని సంచలన కామెంట్స్ చేసారు. మూడేళ్లు అవమానాలు పడ్డాను.. నా కూతురుని ఆ కుటుంబానికి ఇచ్చా కానీ.. ఆ కుటుంబ వ్యాపారాలతో నాకేం సంబంధం అంటూ నిలదీశారు. కేవీ రావు, వైవీ సుబ్బారెడ్డి స్నేహితులు అన్నారు. సుబ్బారెడ్డి అమెరికా వెళ్తే కేవీ రావు ఇంట్లోనే ఉండేవాడని ఈ కేసు ఎందుకు పెట్టారో, ఎవరు చెప్తే పెట్టారో నాకు అర్థమైందన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

దుమారం రేపుతున్న గరికపాటి...

మధ్యాహ్న భోజన పథకంపై గరికపాటి నరసింహరావు...

బీఆర్ఎస్ వర్సెస్ కౌశిక్...

రాజకీయాల్లో దూకుడు స్వభావం ఉన్నా పర్వాలేదు...

టీటీడీలో కమాండ్ కంట్రోల్.....

ఏపీ సిఎం చంద్రబాబు మనువడు, మంత్రి...

బ్రేకింగ్: మొయినాబాద్ డ్రగ్స్...

మొయినాబాద్ డ్రగ్స్ ఉదంతంలో అత్యంత కీలకంగా...

గ్రాండ్ గా రామ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

షిర్డీ సాయిని వెంటాడుతున్న...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని...

పోల్స్