Wednesday, August 5, 2026 06:36 AM
Wednesday, August 5, 2026 06:36 AM

సౌందర్య మరణంలో మోహన్‌ బాబు పాత్ర నిజమేనా?

ఈ మధ్యకాలంలో సినీ నటుడు మోహన్ బాబు కుటుంబం వార్తలలో ఎక్కువగా ఉంటుంది. కుటుంబ వివాదాలతో పాటుగా మరికొన్ని వ్యవహారాల్లో కూడా మోహన్ బాబు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కుటుంబంలో ఆస్తి తగాదాలు ఆయన పరువు తీస్తున్నాయి. సినిమా పరిశ్రమలో పెద్ద మనిషిగా పేరున్న మోహన్ బాబు.. ఇప్పుడు కుటుంబ సమస్యను పరిష్కరించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక తాజాగా ఖమ్మం జిల్లాలో ఆశ్చర్యకరంగా మోహన్ బాబు పై ఒక కేసు నమోదు అయింది.

Also Read : అసెంబ్లీలో మంత్రులను ఇబ్బంది పెడుతున్న అధికారులు

ఈ కేసులో ఆరోపణలు చూస్తే.. మోహన్ బాబు గతంలో చేసిన వ్యవహారాలు ఇంత దారుణంగా ఉన్నాయా అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం గ్రామపంచాయతీ పరిధిలోని ఎదురుగట్ల చిట్టిమల్లు.. అనే వ్యక్తి ఖమ్మం జిల్లా కలెక్టర్, అలాగే ఏసీపీకి ఓ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో ఉన్న వివరాల ప్రకారం.. సినీనటి స్వర్గీయ సౌందర్యకు శంషాబాద్ పరిధిలోని జలపల్లి గ్రామంలో ఆరు ఎకరాల భూమి ఉంది. ఆమెను భూమిని విక్రయించమని మోహన్ బాబు అడిగారు.

Also Read : అమరావతికి మోడీ.. ప్రధాని కార్యాలయం కీలక ప్రకటన

దీనికి ఆమె, ఆమె సోదరుడు అమర్నాథ్ నిరాకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఆరెకరాల భూమిని అమ్మడానికి నిరాకరించడంతో సౌందర్య కుటుంబ సభ్యులపై మోహన్ బాబు కక్షపెంచుకున్నారని… 2004వ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన తెలంగాణలో పార్టీ ప్రచారానికి బెంగళూరు నుంచి వస్తున్న సౌందర్య, ఆమె సోదరుడుని హెలికాప్టర్ ప్రమాదం రూపంలో హత్య చేయించాడని, సాక్ష్యాలు దొరకకుండా చేశాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అక్రమంగా జలపల్లి లో ఉన్న ఆరు ఎకరాల భూమిని అక్రమంగా అనుభవిస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక మంచు మోహన్ బాబు కబ్జాలో ఉన్న భూమిని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, ఆ భూమిని అనాధాశ్రమానికి గాని లేదా మిలిటరీ సోదరులకు గాని, పోలీసులకు గాని మీడియా మిత్రులకు గాని ఇవ్వాలని కోరుతున్నానని ఖమ్మం ఎసిపికి అలాగే ఖమ్మం జిల్లా కలెక్టర్ కు ఆయన ఫిర్యాదు చేశారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్