Wednesday, August 5, 2026 06:31 AM
Wednesday, August 5, 2026 06:31 AM

అమరావతికి మోడీ.. ప్రధాని కార్యాలయం కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పనుల విషయంలో.. రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నది. 40 వేల కోట్ల రూపాయల పనులకు ఒప్పందం కుదుర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం. త్వరలోనే ఈ పనులను మొదలుపెట్టనున్నారు. దీనిపై సీఆర్డీఏ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం భేటీ అయ్యారు. సుదీర్ఘంగా అధికారులతో చంద్రబాబు నాయుడు చర్చించారు. ముందు ఏఏ భవనాలను పూర్తి చేయాలి అనేదానిపై ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది.

Also Read : రాజకీయాలకు వంగవీటి గుడ్ బై..!

అలాగే శాశ్వత భవనాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా అసెంబ్లీ, సచివాలయం సహా కొన్ని కీలక భవనాలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం. ఇక రాజధాని పనుల పునః ప్రారంభానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కూడా ఆహ్వానం పంపించారు. దీనికి ప్రధాని మోడీ అంగీకారం తెలిపినట్లు సమాచారం. త్వరలో తేదీని ప్రధానమంత్రి కార్యాలయం ఖరారు చేసే అవకాశం ఉంది. వచ్చే నెలలో అట్టహాసంగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Also Read : వాళ్లకు లాస్ట్ వార్నింగ్.. చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు…!

తొమ్మిదేళ్ల క్రితం అమరావతి రాజధాని ప్రారంభ పనులకు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఇక పునః ప్రారంభానికి కూడా ప్రధానమంత్రి మోడీ వచ్చేందుకు అంగీకారం తెలపడంతో ఆయనతో కీలక భవనానికి శంకుస్థాపన చేయించే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే అమరావతిలో చెత్త తొలగింపు పనులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. పనులకు భూములను సిద్ధం చేసి పెట్టారు. అటు రైతులు కూడా అమరావతి పనుల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రోడ్డు విస్తరణ పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టే అవకాశాలున్నాయి. సీడ్ యాక్సెస్ రోడ్డును వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అలాగే కరకట్ట రోడ్డును కూడా విస్తరించాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్