Thursday, September 17, 2026 09:41 PM
Thursday, September 17, 2026 09:41 PM

పరారీలో వైసీపీ ఎమ్మెల్సీ..!

దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత సత్య ఉదయ భాస్కర్ ఎలియాస్ అనంతబాబు.. అజ్ఞాతంలో ఉన్నారు. శాసన మండలి సమావేశాలకు హాజరైన అనంతబాబు.. ఊహించని రీతిలో షాక్ ఇచ్చారు. తన గన్‌మెన్‌లకు కూడా చెప్పకుండా ఒక్కసారిగా మండలి నుంచి వెళ్లిపోయారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసిన కేసులో అనంతబాబుతో పాటు ఆయన భార్య కూడా నిందితురాలు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం అనంతబాబు భార్య కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ హత్య కేసులో అరెస్టైన అనంతబాబు.. బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసు విచారణ ఆలస్యంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు.

Also Read : 10 కోట్లు ఇవ్వకపోతే లేపెస్తాం.. స్టార్ హీరోకి బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్..!

విశాఖ ఏజెన్సీలో రంగురాళ్ల తరలింపులో అనంతబాబు ప్రమేయం ఉందని గతంలోనే అనంతబాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక విశాఖ ఏజెన్సీలో మహిళల పట్ల కూడా అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు కూడా అనంతబాబుపై ఉన్నాయి. కొండ కాపు తెగకు చెందిన వ్యక్తిగా చెప్పుకునే అనంతబాబు.. 2014లో తొలిసారి రంపచోడవరం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే స్థానిక గిరిజనులు అనంతబాబు కులంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. అయితే వైసీపీ తరఫున వంతల రాజేశ్వరిని బరిలో నిలిపారు. ఆమె గెలిచిన తర్వాత నియోజకవర్గంలో పెత్తనం చేశారు.

2019లో కూడా ధనలక్ష్మి గెలిచిన తర్వాత.. వైసీపీ ప్రభుత్వంలో అనంతబాబు మరింత రెచ్చిపోయారు. ఏజెన్సీలో పెత్తనం చేశారు. గిరిజనులపై దాష్టికం చేశారు. చివరికి తన డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి సొంత కారులోనే నేరుగా తీసుకెళ్లి అతని కుటుంబసభ్యులకు శవాన్నీ డోర్ డెలివరీ చేశారు. ఈ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన దగ్గర తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వకుండా నోటీకి వచ్చినట్లు వ్యాఖ్యానించారని.. అందుకే అతన్ని కొట్టినట్లు అనంతబాబు చెప్పారు. అయితే ఈ దారుణ హత్యలో అనంతబాబు భార్య అనంత లక్ష్మ దుర్గ ఎలియాస్ రోజా పాత్రపై సిట్ బృందం కీలక సాక్ష్యాలు సేకరించింది. దీంతో ఆమెను ఈ కేసులో రెండో నిందితురాలిగా చేరుస్తూ రాజమహేంద్రవరం ఎస్సీ, ఎస్టీ కోర్టులో సిట్ అధికారులు అభియోగ పత్రం దాఖలు చేశారు.

Also Read : భారత్ పై ట్రంప్ మరోసారి సంచలన కామెంట్..!

ఈ కేసులో భార్యా భర్తల అరెస్టు తప్పదనే మాట బాగా వినిపిస్తోంది. దీంతో అరెస్టు భయంతోనే భార్యాభర్తలు పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే అనంత లక్ష్మీ దుర్గ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ విషయంపై సుప్రీం కోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కూడా అరెస్టు భయంతో పరారయ్యారు. అందుకే మండలి నుంచి కనీసం తన గన్‌మెన్‌లకు కూడా చెప్పకుండా.. సైలెంట్‌గా పరారయ్యారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్