Monday, August 3, 2026 04:27 PM
Monday, August 3, 2026 04:27 PM

బొత్సకు లోకేష్ అదిరిపోయే కౌంటర్..!

ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో లడ్డూ రాజకీయం వేడెక్కింది. గత వారం రోజుల నుంచి ఈ వ్యవహారం తీవ్ర స్థాయిలో వేడెక్కిస్తుంది. కల్తీ లడ్డుపై వైసీపీని కూటమి సర్కార్ టార్గెట్ చేయడం, ఆ తర్వాత వైసీపీ ఇందాపూర్ డైరీకి, హెరిటేజ్ కు లింక్ చేసి విమర్శలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. నేడు అయితే సభలో ఇరుపక్షాల మధ్య వాతావరణం తీవ్ర స్థాయిలో కనపడిన మాట వాస్తవం. వైసీపీ సభ్యులు వెంకటేశ్వర స్వామి వారి ఫోటో తీసుకుని సభకు రావడంపై టీడీపీ, బిజెపి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసాయి.

Also Read : పయ్యావుల విశ్వరూపం.. హాట్ హాట్ గా మండలి..!

ఇక దీనిపై కూటమి నేతలు అత్యవసరంగా సమావేశం కూడా నిర్వహించి వైసీపీ విషయంలో నిరసన కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వేంకటేశ్వరస్వామి ఆలయాలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుంది కూటమి. ఈ నేపధ్యంలో వెంకటపాలెంలోని టీటీడీ ఆలయానికి వెళ్లే యోచనలో కూటమి నేతలు ఉన్నారు. ఇక దీనిపై మంత్రి నారా లోకేష్ తీవ్ర విమర్శలకు దిగారు. ‘మా సభ్యులు చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫోటోతో సభలోకి వెళ్లినట్లు ఒక్క ఫోటో అయినా చూపించగలరా..?’ అని ప్రతిపక్ష నేత బొత్స సవాల్ చేసారు.

Also Read : సోషల్ మీడియాలో జగన్ కామెడీ వైరల్..!

దీనికి కౌంటర్ గా లోకేష్.. వైసీపీ ఎమ్మెల్సీలు చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫోటో పట్టుకెళ్లిన ఫోటోలు, వీడియోలను ‘ఎక్స్’ వేదికగా విడుదల చేసారు. మీకు దేవుడంటే భక్తి, భయం లేదు.. హిందువుల మనోభావాలంటే లెక్కే లేదు అంటూ వైసీపీ సభ్యులను టార్గెట్ చేసుకుని విమర్శించారు లోకేష్. మీరు బూట్లు, చెప్పులతో వేంకటేశ్వరస్వామి చిత్రపటాలు పట్టుకుని మహాపరాధం చేశారు అని, కౌన్సిల్‌లో ప్రదర్శించిన శ్రీవారి ఫోటోలు అక్కడే విసిరేసి వెళ్లడం క్షమించరాని పాపం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఉరవకొండలో పొలిటికల్ హీట్.....

ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజకీయ వాతావరణం...

ఉత్తరాంధ్ర కాదు.. ఇక...

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి...

ఇదీ ఉత్తరాంధ్ర దెబ్బ.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

మోడీని దారుణంగా మాట్లాడారు.....

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ...

భోగాపురంలో చరిత్ర సృష్టించిన...

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమవుతూ,...

అంతర్జాతీయ అద్భుతం.. మన...

విజయనగరం జిల్లా భోగాపురంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా...

పోల్స్