Friday, June 12, 2026 05:35 PM
Friday, June 12, 2026 05:35 PM

బదిలీలపై నిషేధం తొలగిస్తారా..?

ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల పై నిషేధం సడలించి.. బధిలీలకు మళ్లీ అనుమతిస్తారా..? ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ప్రస్తుతం నిషేధం అమలులో ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఆ నిషేధం ఎత్తివేసి.. బదిలీలకు నెల రోజులు అనుమతి ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం ఏపీ సచివాలయంలో జరుగుతోంది. ఉద్యోగుల బదిలీలపై, ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం ఉద్యోగుల సాధారణ బదిలీలు జరుగుతాయా.. అనే అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Also Read : లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ.. ఫుల్ క్లారిటీ..!

సాధారణంగా ప్రతి ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఉద్యోగుల బదిలీలు ఉంటాయి. విద్యా సంవత్సరం దృష్టిలో పెట్టుకుని.. పిల్లలకు, తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఉద్యోగ, ఉపాధ్యాయులను ఇలా వేసవిలోనే బదిలీలు చేస్తుంటారు. ఈ ఏడాది కూడా అమలు చేయాల్సి ఉంది. గతంలో జారీచేసిన జీవో-38 ప్రకారం.. 2026 మే 1నుంచి మే 31వరకు కొన్ని నిర్దిష్ట నిబంధనలతో ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం సడలించింది. మే 31తో ఆ గడువు ముగియడంతో జూన్‌ 1 నుంచి అన్ని రకాల బదిలీలను నిలిపివేస్తూ సర్కార్ తాజా ఉత్తర్వులు ఇచ్చింది. ఇందుకు ప్రధానంగా జనాభా గణన ప్రక్రియను కారణంగా చూపిస్తోంది. గడువులోకా పూర్తి చేయాలంటే ఈ విధులకు కేటాయించిన వివిధ కేడర్ల అధికారులు, సిబ్బంది బదిలీలపై తాత్కాలిక నిషేధం విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Also Read : ముంబైలో బన్నీ ఇంటి అద్దెకే నెలకు 16 లక్షలా?

అయితే ఉద్యోగ సంఘాల నేతల విజ్ఞప్తి మేరపు బదిలీలకు అనుమతి ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. నిజానికి ఇప్పటికే పాఠశాలలు ప్రారంభం అయ్యాయి. అయినా సరే.. సీఎం చంద్రబాబు గారు ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనే విషయం ఇప్పటి వరకు బయటకు రాలేదు. ఇంతకు ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు, సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా.. లేదా..? అనే విషయం కూడా తెలియటం లేదు. అటు ప్రభుత్వం.. ఇటు ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఈ బదిలీల విషయంపై ఎక్కడా చర్చించకపోవడంతో.. ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బదిలీల విషయం పై నోరెత్తటం లేదు. సీఎం చంద్రబాబు కూడా సాధారణ బదిలీలు అంత అవసరమా? అనే భావనతో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే బదిలీ కోసం చాలా మంది ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. పిల్లల చదువులు, కుటుంబ పరిస్థితులు, సీనియారిటీ వంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆలోచన ఏమిటనే విషయం ఉద్యోగులను ఆందోళనకు గురి చేస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కింగ్ పిన్ చుట్టూ...

వేల కోట్ల మద్యం కుంభకోణం, రవాణా...

కేంద్ర మంత్రివర్గంలో జనసేన.....

కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్దం...

ముంబైలో బన్నీ ఇంటి...

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం...

గోపాలన్న కల ఈసారైనా...

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ అంశం మళ్లీ...

కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం..!

బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఓటమి...

భాగ్యనగరం.. ఒక్క వర్షం.....

భారీ వర్షం హైదరాబాద్ మహానగరాన్ని మరోసారి...

పోల్స్