ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా దూసుకుపోతున్నారు. ‘పుష్ప’ సినిమాతో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించిన బన్నీ ఇప్పుడు తన కెరీర్‌లో మరో కీలక అడుగు వేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాబోయే మూడు సంవత్సరాల పాటు వరుస బాలీవుడ్, పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ల కోసం ఆయన ముంబైకి షిఫ్ట్ అవుతున్నారట. ఇందుకోసం ముంబైలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటైన జుహు ప్రాంతంలో సముద్ర తీరానికి సమీపంలో ఉన్న ఓ లగ్జరీ 5BHK అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నారని సమాచారం. అయితే ఆ ఫ్లాట్ రెంట్ వింటే మాత్రం ఎవరికైనా షాక్ తగలాల్సిందే!
Also Read : కామెడీ పేరుతో లేకి పనులు.. వెకిలి చేష్టలు..!
సమాచారం ప్రకారం, అల్లు అర్జున్ ఈ లగ్జరీ నివాసం కోసం నెలకు దాదాపు రూ.16 లక్షల అద్దె చెల్లిస్తున్నారట. అంటే ఏడాదికి దాదాపు రూ.1.92 కోట్లు, మూడు సంవత్సరాలకు సుమారు రూ.5.7 కోట్లకు పైగానే ఖర్చవుతుందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక ఇదే సమయంలో హైదరాబాద్‌లో అల్లు అర్జున్ తన డ్రీమ్ హౌస్ నిర్మాణాన్ని కూడా కొనసాగిస్తున్నారట. దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో ఈ భారీ నివాసాన్ని నిర్మిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవైపు వంద కోట్ల విలువైన ఇంటి నిర్మాణం, మరోవైపు నెలకు 16 లక్షల అద్దెతో ముంబైలో లగ్జరీ లైఫ్… ఈ రెండు విషయాలు ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read : ప్లీజ్.. మిమ్మల్ని వదిలేయమంటున్న మహేష్..!
‘పుష్ప 2’ విజయంతో దేశవ్యాప్తంగా మార్కెట్‌ను విస్తరించుకున్న బన్నీ, ఇప్పుడు బాలీవుడ్‌లో కూడా తన ప్రభావాన్ని మరింత పెంచే ప్రయత్నంలో ఉన్నారని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే షూటింగ్‌లు, మీటింగ్‌లు, బ్రాండ్ ఎండోర్స్‌మెంట్‌ల కోసం ముంబైలో స్థిరపడే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఈ రెంట్ వార్తలపై అల్లు అర్జున్ టీమ్ నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం “ఒక నెల రెంట్‌తో చిన్న అపార్ట్‌మెంట్ కొనేయొచ్చు” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరి బన్నీ ముంబై మకాం వెనుక అసలు ప్లాన్ ఏమిటి? కొత్త బాలీవుడ్ ప్రాజెక్ట్‌లకు ఇది సంకేతమా? అనే విషయాలు త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

