ఒక సాధారణ డ్యాన్సర్‌గా కెరీర్ ఆరంభించారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన ముఠామేస్తీ సినిమాలో ఓ పాటలో సైడ్ డ్యాన్సర్‌గా ఎక్కడో ఓ మూల కనిపించిన రాఘవ లారెన్స్.. సరిగ్గా 30 ఏళ్లకు ఎక్కడికో చేరుకున్నారు. ఆయనే డ్యాన్సర్, కోరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్. 1993లో ముఠామేస్త్రి సినిమాలో చిరంజీవి వెనుక మూడో వరుసలో డ్యాన్స్ చేసిన లారెన్స్.. ఆ తర్వాత అదే చిరంజీవికి కొరియోగ్రాఫర్ అయ్యారు. నటుడిగా, దర్శకుడిగా బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చారు. నాగార్జున, ప్రభుదేవా వంటి హీరోలను డైరెక్ట్ చేసారు. నృత్య దర్శకుడిగా 4 ఫిలిం ఫేర్ అవార్డులు, 3 నంది పురస్కారాలు సాధించాడు. 2015 లో భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరణించిన తరువాత ఆయన పేరుతో ఒక సేవా సంస్థను ఏర్పాటు చేసి అందుకు కోటి రూపాయలు విరాళంగా ఇచ్చాడు.
Also Read : కేంద్ర మంత్రివర్గంలో జనసేన.. ఆయనే ఫైనల్..!
తాజాగా రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ కొద్ది రోజులుగా జోరుగా చర్చ నడుస్తోంది. ఈ చర్చకు బ్రేక్ పెట్టాల్సిన సమయం వచ్చిందని ఓ వారం రోజులుగా లారెన్స్ సోషల్ మీడియాలో ఒక ప్రకటన చేశారు. ముందుగా ఈ నెల 11న చెబుతా అని చెప్పిన లారెన్స్.. ప్రముఖ దర్శకులు భారతీ రాజా మృతి వల్ల తన ప్రకటన ఒకరోజు వాయిదా వేశారు. తాజాగా తన రాజకీయ ప్రవేశంపై రాఘవ లారెన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళ రాజకీయాల్లో విజయ్ చరిత్ర సృష్టించారని మరోసారి గుర్తు చేశారు. రాజకీయాల్లో ఎవరైనా రాణించగలరనే నమ్మకం కలిగించారన్నారు. తాను రాజకీయాల్లోకి వెళ్తానని తల్లిని అడిగాన్న లారెన్స్.. రాజకీయాల్లోకి వెళ్లేందుకు తన తల్లి తనకు అనుమతి ఇచ్చారన్నారు. రాజకీయాల్లోకి రావడంపై ప్రజల అభిప్రాయం తీసుకుంటా అని.. ప్రజలు ఆమోదిస్తే రాజకీయాల్లోకి వస్తా.. ప్రజలు కాదంటే రాజకీయాలకు దూరంగా ఉంటా అని రాఘవ లారెన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read : కామెడీ పేరుతో లేకి పనులు.. వెకిలి చేష్టలు..!
రెండు నెలల క్రితం జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ రెండు చోట్ల పోటీ చేసి విజయం సాధించారు. తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ స్థానాల నుంచి పోటీ చేసి విజయం సాధించిన విజయ్.. అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాన్ని వదులుకున్నారు. మరో నాలుగు నెలల్లో తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతుంది. నిజానికి మొదటి నుంచి తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గం నుంచి నటి త్రిషా లేదా విజయ్ తండ్రి పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ అనూహ్యంగా ఆ స్థానం నుంచి టీవీకే తరఫున రాఘవ లారెన్స్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా లారెన్స్ రాజకీయ ప్రవేశంపై చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ఈ ప్రచారానికి బలం ఇస్తోంది.

