Thursday, September 17, 2026 11:34 PM
Thursday, September 17, 2026 11:34 PM

గోపాలన్న కల ఈసారైనా తీరుతుందా..?

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. రెండున్నర ఏళ్లుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మూడో మంత్రి పదవి కోసం నేతలు ఎదురు చూస్తున్నారు. ఈ నెలాఖరులోగా రాష్ట్ర కేబినెట్ విస్తరణ జరుగుతుందన్న చర్చ నేపథ్యంలో మంత్రి పదవిపై చర్చ జోరందుకుంది. ఈసారైనా జిల్లాకు మరో మంత్రి పదవి వస్తుందా? మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నేనావత్ బాలు నాయక్‌లలో ఎవరిని మినిస్ట్రీ వరిస్తుందన్న చర్చ సాగుతోంది. ఎప్పుడు కేబినెట్ విస్తరణ అంశం తెర పైకి వచ్చినా.. ముందుగా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవిపైనే చర్చ జరగడం పరిపాటిగా మారింది. అయితే, ఈసారి పరిస్థితి సానుకూలంగా ఉండొచ్చని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Also Read : కాంగ్రెస్‌లో టీఎంసీ విలీనం..!

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని కలవడంతో ఈ చర్చకు మరింత బలం చేకూరింది. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవిపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గతంలోనే హామీ ఇచ్చింది. కానీ, సామాజిక సమీకరణల దృష్ట్యా ఆయనకు అప్పుడు పదవి దక్కలేదు. దాంతో ఆయన కొంత నిరాశకు గురయ్యారు. మళ్లీ విస్తరణలో అవకాశం కల్పిస్తామని అధిష్టానం నుంచి రాజగోపాల్ రెడ్డికి సంకేతాలు అందినట్లు సమాచారం. ప్రస్తుతం త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, ఈసారి రాజగోపాల్ రెడ్డి బెర్ ఖాయమనే చర్చ సాగుతోంది. ఇటీవల ఆయన రాహుల్‌గాంధీతో భేటీ అయిన సందర్భంలోనూ తనకు అధిష్టానం ఏం హామీ ఇచ్చింది… తనకు అప్పగించిన బాధ్యతలను పక్కాగా ఎలా నిర్వర్తించారు.. తనకు మంత్రి పదవి ఇవ్వాల్సిన ఆవశ్యకతపై రాహుల్‌గాంధీకి వివరించినట్లు తెలిసింది. రాజగోపాల్ రెడ్డి మాత్రం.. తాను రాహుల్ గాంధీని మర్యాదపూర్వకంగా కలిసినట్లు పేర్కొన్నారు.

Also Read : కూటమిలో కుంపటి పెట్టిన అమిత్ షా..!

దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ కూడా రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బలహీనవర్గాల కోటాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో.. అదీ పాత తరం వారికి మాత్రమే మంత్రి పదవులు దక్కాయి. కొండా లక్ష్మణ్ బాపూజీ, కొమ్ము పాపయ్య, రవీంద్ర నాయక్ 1985కు ముందు మంత్రి పదవులు దక్కగా, ఆ తరువాత బలహీనవర్గాల కోటాలో మరెవరికి మంత్రి పదవి రాలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా నల్గొండ జిల్లాలో అవకాశం దక్కలేదు. ఈ నేపథ్యంలో సీనియర్ అయిన తనకు మంత్రి పదవి ఇవ్వాలని గతంలోనే ఎమ్మెల్యే బాలునాయక్ అధిష్టానాన్ని కోరారు. రాష్ట్ర కేబినెట్‌లో ఆదివాసీల నుంచి సీతక్కకు మంత్రి పదవి దక్కగా, లంబాడా కోటాలో బాలునాయక్‌కు ఇస్తారని, సీఎం రేవంత్‌ రెడ్డి కూడా అందుకు సానుకూలంగా ఉన్నట్లు అప్పట్లో చర్చ జరిగింది. రాజ్యసభ ఎన్నికలు ముగిసిన వెంటనే తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో భాగంగా నేతలకు ఏ క్షణంలోనైనా పిలుపురావచ్చన్న చర్చ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్