Wednesday, June 10, 2026 08:02 PM
Wednesday, June 10, 2026 08:02 PM

కూటమిలో కుంపటి పెట్టిన అమిత్ షా..!

కూటమి పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయా..? కూటమి పార్టీల నేతల మధ్య సఖ్యత లేదా.. అనే ప్రశ్నలకు ప్రస్తుతం అవును అనే జవాబు వస్తుంది. ముఖ్యంగా ఏపీలో అధికారంలోకి వచ్చేందుకు జట్టు కట్టిన టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య తొలి నుంచి సఖ్యత లేదనే మాట బాగా వినిపిస్తోంది. వీటిల్లో టీడీపీ, జనసేన మధ్య పొత్తు మరో 15 ఏళ్లు కొనసాగుతుందని జనసేనాని పవన్ కల్యాణ్, టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ స్పష్టంగా చెబుతున్నప్పటికీ.. బీజేపీ నేతలు మాత్రం.. అసలు పొత్తు గురించి ఒక్క మాట కూడా అనటం లేదు. పైగా దీంతో “ఈ బంధం బలమైనదేనా..?” అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

Also Read : పవన్ ఫ్యూచర్‌పై సస్పెన్స్..!

ఇప్పటికే అనుమానపు కాపురం చేస్తున్న పార్టీ బీజేపీ నేతలు.. తాజాగా ఓ పిడుగులాంటి వార్తను పేల్చారు. రాబోయే తెలంగాణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తుందని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. పార్టీ విస్తరణ, స్వతంత్ర రాజకీయ బలం పెంపుపై దృష్టి సారించిన బీజేపీ, ఇకపై రాష్ట్రాల్లో మిత్రపక్షాలపై ఆధారపడకుండా అధికారాన్ని లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతుందని వెల్లడించారు. మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడిన అమిత్ షా, తెలంగాణతో పాటు పంజాబ్ వంటి రాష్ట్రాల్లో కూడా పార్టీ స్వతంత్రంగా పోటీ చేసి అధికారంలోకి రావడమే లక్ష్యమని తెలిపారు. ప్రతి రాష్ట్రంలో బీజేపీని ప్రధాన రాజకీయ శక్తిగా నిలబెట్టేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నామని చెప్పారు.

దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అమిత్ షా వ్యాఖ్యానించారు. తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను మరింత విస్తరించేందుకు కృషి చేస్తున్నామన్నారు. రానున్న ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు సమిష్టిగా పనిచేసి ప్రజల్లో బీజేపీ సిద్ధాంతాలను తీసుకెళ్లాలని సూచించారు. దేశంలో ప్రతి పౌరుడికి ఒకే విధమైన చట్టాలు ఉండాలన్నదే తమ పార్టీ అభిప్రాయమని తెలిపారు. తెలంగాణ రాజకీయాల్లో పొత్తుల అంశంపై అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రానున్న ఎన్నికల్లో బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతుందనే దానిపై ఈ ప్రకటన స్పష్టత ఇచ్చిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Also Read : వైసీపీ రాజకీయం.. మాయమయిన మానవత్వం

అయితే ఈ ప్రకటన ఒక్క తెలంగాణకు మాత్రమే పరిమితం కాదంటున్నారు. పంజాబ్‌తో అన్ని రాష్ట్రాల్లో స్వతంత్రంగా పోటీ చేసి అధికారంలోకి రావడం.. అనే మాట ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రాబోయే ఎన్నికల్లో ఏపీలో కూడా ఎలాంటి పొత్తు లేకుండా ఒంటరిగా చేస్తారా.. అనే ప్రశ్న తలెత్తుతోంది. మరోవైపు తెలంగాణలో తాము పోటీ చేస్తామని ఇప్పటికే జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాబోయే జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీలు వేరు వేరుగా పోటీ చేస్తాయా.. అనే అనుమానం తలెత్తుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

భాగ్యనగరం.. ఒక్క వర్షం.....

భారీ వర్షం హైదరాబాద్ మహానగరాన్ని మరోసారి...

ఇంత చిన్న లాజిక్...

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి...

వైసీపీ రాజకీయం.. మాయమయిన...

విశాఖపట్నంలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్...

పేర్ని దూకుడుకు బ్రేకులు...

వై నాట్ 175 అన్నారు.. 30...

విశాఖ KGHకు లోకేష్‌.....

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై తీవ్ర...

నా పేరు వాడుకోవద్దు...

తమిళనాడు రాజకీయాల్లోనే కాకుండా దేశ రాజకీయాల్లో...

పోల్స్