ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాలపైనే ఫోకస్ పెట్టారు. దీంతో ఆయన అప్ కమింగ్ మూవీలపై ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియుల్లో కూడా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం పవన్ కొత్త ప్రాజెక్టుల విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ కనిపించడం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ తర్వాత పవన్ సినిమా ఏదో తెలియటం లేదు. 2026 ఏడాదిలో ఇప్పటికే 5 నెలలు గడిచిన.. ఇప్పటి వరకు పవన్ కొత్త సినిమా ఏదీ సెట్స్ పైకి వెళ్లలేదు. డిప్యూటీ సీఎంగా కీలక శాఖల బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ తరచూ మీటింగ్స్, విజిట్స్‌తో పాటు పీపుల్ ఈవెంట్స్‌తో బిజీగా గడుపుతున్నారు. అదే సమయంలో జనసేన పార్టీని మరింత స్ట్రాంగ్‌గా మార్చడం, ఫ్యూచర్ పొలిటికల్ స్ట్రాటజీపై ఆయన దృష్టి పెట్టినట్లు క్లియర్‍గా తెలుస్తోంది. అందుకే సినిమాల విషయంలో కాస్త తక్కువ సమయం కేటాయిస్తున్నట్లు అర్ధమవుతోంది.
Also Read : అప్పుడు గుర్తు లేదా.. ఇప్పుడే యాదికి వచ్చిందాఅంబటి..?
కానీ పవర్ స్టార్‌ను మళ్లీ స్క్రీన్ పైన చూడాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో వస్తున్న పలు వార్తలు వైరల్ చేస్తున్నారు. తాజాగా పవన్ కొత్త సినిమాలకు సంబంధించి వస్తున్న పుకార్లకు చెక్ పడింది. ప్రస్తుతం పవన్ ఎలాంటి కొత్త చిత్రాలకు సంతకం చేయలేదని, వెంటనే కొత్త ప్రాజెక్టులను ప్రారంభించే ప్లాన్ కూడా లేదని ఆయన సొంత బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ క్లారిటీ ఇచ్చింది. అయితే ఇప్పటికే ప్రకటించిన ప్రాజెక్టుల సంగతేంటి? పవన్ ప్లాన్ ఏంటి? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఓకే చేసిన ప్రాజెక్టులు పవన్ ఇప్పటికే కంప్లీట్ చేశారు. అవి రిలీజ్ కూడా అయ్యాయి. ఆ తర్వాత సినిమాలు చేయరేమో అని అంతా అనుకున్నారు. కానీ అందులో ఒక సినిమా ఓజీకి సీక్వెల్ లేదా ప్రీక్వెల్‌లో నటిస్తున్నట్లు పవన్ హింట్ ఇచ్చారు. దీంతో పవన్ సినిమాలు కంటిన్యూ చేస్తారని ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యారు.
Also Read : రెండు పదవులు చాలవా.. మరో పదవి కావాలా..!
ఇంతలోనే సురేందర్ రెడ్డితో మరో సినిమా ప్రకటించారు. వక్కంతం వంశీ ఆ సినిమాకు కథ అందిస్తున్నారు. అయితే ఆ ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభమవుతుందని గతంలో వార్తలు వచ్చినా, ఇప్పటి వరకు షూటింగ్‌కు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఓజీ-2 పరిస్థితి కూడా అంతే. ఫ్రీ ప్రొడక్షన్ పనులు అవుతున్నాయని తెలుస్తున్నా.. దర్శక, నిర్మాతల నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. అవన్నీ ఒకెత్తు అయితే.. నిర్మాతగా కూడా చురుగ్గా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ గతంలో ప్రకటించారు. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ద్వారా పలు ప్రాజెక్టులపై చర్చలు జరిగినప్పటికీ, ఇప్పటి వరకు స్టార్ట్ అవ్వలేదు. దీంతో అసలు పవన్ ప్లాన్ ఏంటి? ఏం చేయనున్నారు? అంటూ ఫ్యాన్స్‌తో పాటు టాలీవుడ్‌లో కూడా జోరుగా చర్చ నడుస్తోంది.
Also Read : స్టీల్ ప్లాంట్.. నిర్లక్ష్యంతో బూడిదవుతున్న కార్మికులు..!
రాజకీయాల్లో బిజీగా ఉన్న జనసేనాని.. కొత్త సినిమాలు ఎందుకు మొదలు పెట్టడం లేదంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే రీసెంట్‌గా పవన్ చిన్నపాటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల ఆపరేషన్ కూడా జరిగింది. దాని వల్ల ఇప్పుడు సినిమాలపై దృష్టి పెట్టడం లేదని తెలుస్తోంది. అదే సమయంలో రాజకీయ బాధ్యతలు ఎక్కువగా ఉండటంతో సినిమాలకు పూర్తి సమయం కేటాయించడం సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే ప్రకటించిన ప్రాజెక్టులు 5 వరకు ఉన్నప్పటికీ, ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్స్ రావడం లేదు. దీంతో అభిమానుల్లో ఒకే ప్రశ్న వినిపిస్తోంది.. అసలు పవన్ కళ్యాణ్ ప్లాన్ ఏంటనేది!

