Sunday, August 9, 2026 03:56 PM
Sunday, August 9, 2026 03:56 PM

నితీష్ ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేయడం లేదు..? చివరిసారి ఎప్పుడు పోటీ చేసారు..?

బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయం ఆసక్తిని రేపుతోంది. మరోసారి నితీష్ సిఎం అయ్యే అవకాశం ఉందని ఎన్డియే ధీమాగా ఉండగా.. ఇండియా కూటమి సత్తా చాటే ఛాన్స్ ఉందని కాంగ్రెస్, ఆర్జెడి అంటున్నాయి. ఇదిలా ఉంచితే ఇప్పుడు నితీష్ కుమార్ మరోసారి నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అయ్యారు. భారతదేశంలో అత్యంత ఎక్కువ కాలం పనిచేసిన ముఖ్యమంత్రులలో నితీష్ కుమార్ ఒకరు. దాదాపు రెండు దశాబ్దాల పాటు బీహార్‌ ను పాలించారు నితీష్ కుమారు. అయితే, జనతాదళ్ (యునైటెడ్) అధినేతకు ఓ రాజకీయ ప్రత్యేకత ఉంది.

Also Read : జైస్వాల్ పై కావాలనే వివక్ష చూపుతున్నారా..?

ఆయన తన రాజకీయ జీవితంలో ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యే అయినా.. ముఖ్యమంత్రిగా మాత్రం ఎమ్మెల్సీగానే కొనసాగారు. దీనిపై ప్రత్యర్ధులు ఎన్ని విమర్శలు చేసినా ఆయన మాత్రం తన పంథా మార్చుకోలేదు. ఇప్పటి వరకు ఎమ్మెల్సీగానే ఆయన కంటిన్యూ అవుతూ వస్తున్నారు. ఇక నవంబర్ 6, 11 తేదీల్లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేయడం లేదు. నితీష్ కుమార్ 1977, 1980, 1985లలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసారు. 1985లో ఒక్కసారి మాత్రమే విజయం సాధించారు.

Also Read : చంద్రబాబు ఇలా.. మరి జగన్ అయితే..?

ఆ తర్వాత, ఆయన జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించి వరుసగా ఆరు లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసి – 1989, 1991, 1996, 1998, 1999 మరియు 2004 అన్ని ఎన్నికల్లో గెలిచారు. నితీష్ కుమార్ మొదట 2000 సంవత్సరంలో బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు, కానీ రెండు సభలలో సభ్యుడు కాకపోవడంతో ఎనిమిది రోజుల్లోనే రాజీనామా చేశారు. 2005లో తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు, అసెంబ్లీ స్థానానికి పోటీ చేయడానికి బదులుగా బీహార్ శాసనమండలిలో అడుగుపెట్టారు. శాసన మండలి ఉన్న ఆరు రాష్ట్రాల్లో బీహార్ ఒకటి. అసెంబ్లీకి పోటీ చేస్తే ఒక్క స్థానంపైనే దృష్టి పెడతామని, కానీ ఎమ్మెల్సీ అయితే రాష్ట్రం మొత్తంపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుందని కామెంట్ చేసారు నితీష్.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మంత్రులకి లోకేష్‌ బిగ్‌...

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా...

ఏపీలో త్వరలోనే క్యాబినెట్‌...

ఏపీ రాజకీయాల్లో మరోసారి కేబినేట్ ప్రక్షాళన...

పార్టీ ఆఫీస్ లో...

స్థానిక సంస్థల ఎన్నికల హడావుడి మొదలు...

పోలీసులను టార్గెట్ చేసిన...

గత కొన్ని రోజులుగా సంచలనంగా మారిన...

జనసేన జెండా కోసం...

డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రాజకీయంగా...

కవితను లైట్ తీసుకున్న...

తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్, బావ...

పోల్స్