Wednesday, May 6, 2026 07:24 PM
Wednesday, May 6, 2026 07:24 PM

రోడ్డు ప్రమాదాల కట్టడికి వీ టూ వీ టెక్నాలజీ.. కేంద్రం కీలక అడుగు..!

దేశంలో వాహన ప్రమాదాలు పెరిగిపోతున్న నేపధ్యంలో.. కేంద్రం కీలక అడుగులు వేస్తోంది. ప్రమాదాలను అరికట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపధ్యంలో కేంద్రం 2026 చివరి నాటికి వెహికల్ టూ వెహికల్ (V2V) కమ్యూనికేషన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడానికి సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ వ్యవస్థ ద్వారా వాహనాలు నెట్‌వర్క్ అవసరం లేకుండా ఒకదానితో ఒకటి నేరుగా కనెక్ట్ కావడానికి అవకాశం దొరుకుతుంది. దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతను బలోపేతం చేయడం, ప్రమాదాలను తగ్గించడం దీని లక్ష్యం.

Also Read : వెనిజులా చమురు భారత్ కు..? అమెరికా సంచలన నిర్ణయం..!

ముఖ్యంగా పార్క్ చేసిన వాహనాలు, వెనుక నుండి వేగంగా వెళ్లే వాహనాల ప్రమాదాలను నివారించడంలో ఈ సాంకేతికత ప్రభావవంతంగా ఉంటుందని భావిస్తున్నారు. దట్టమైన పొగమంచు సమయంలో పెద్ద ఎత్తున గుంతలు ఉన్నప్పుడు ఇబ్బందులు రాకుండా ఉండటానికి అడుగులు వేస్తోంది. ఈ వ్యవస్థ ద్వారా, వాహనాలు సిగ్నల్‌ లను ఒకదానితో ఒకటి మార్పిడి చేసుకుంటాయి. మరొక వాహనం ప్రమాదకరంగా దగ్గరగా వచ్చినప్పుడు డ్రైవర్లకు వార్నింగ్ సిగ్నల్ ఇస్తాయి. రాష్ట్రాల రోడ్డు రవాణా మంత్రులతో జరిగిన వార్షిక సమావేశం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ వివరాలు బయటపెట్టారు.

Also Read : గర్భాశయ క్యాన్సర్ లక్షణాలు ఏంటీ..? గుర్తించటం ఎలా ?

సమావేశంలో ఈ విషయంపై చర్చించామని, ఈ సాంకేతికత త్వరలో అమలు చేస్తామన్నారు. ముఖ్యంగా రోడ్లపై వాహనాలు నిలిపి ఉంచినప్పుడు, మంచు కారణంగా ప్రమాదాలు జరుగుతోన్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న బస్సుల్లో అగ్నిమాపక యంత్రాలు, డ్రైవర్లకు నిద్రమత్తును గుర్తించే వ్యవస్థలు, ప్రయాణీకులకు అత్యవసర పరికరాలు వంటి వాటిని అమర్చనున్నట్లు పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలలో మాత్రమే ఇటువంటి సాంకేతికత ప్రస్తుతం వాడుకలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.5,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

నిజంగా కేసీఆర్ కు...

తెలంగాణ రాజకీయాల్లో అధికార కాంగ్రెస్, విపక్ష...

పోల్స్