Saturday, June 20, 2026 10:59 PM
Saturday, June 20, 2026 10:59 PM

యూపీ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అజయ్ శర్మకు.. బెంగాల్‌ లో పోస్టింగ్..!

ఉత్తరప్రదేశ్ పోలీస్ శాఖలో అత్యంత పవర్‌ ఫుల్ ఆఫీసర్‌ గా పేరుగాంచిన 2011 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మ ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌ లో బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఆయనను ఐదేళ్ల కాల పరిమితితో పశ్చిమ బెంగాల్ కేడర్‌ కు అంతర్రాష్ట్ర డిప్యుటేషన్‌ పై పంపుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. యూపీలో నేరస్తుల పాలిట సింహస్వప్నంగా మారిన ఈ అధికారి బదిలీ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Also Read  : సీఎం రాజీనామా చేయకపోతే..? రాజ్యాంగం ఏం చెప్తుంది..?

అజయ్ పాల్ శర్మ తన కెరీర్‌ లో ఇప్పటివరకు సుమారు 500 ఎన్‌కౌంటర్లలో పాల్గొని ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ గా గుర్తింపు పొందారు. ముఖ్యంగా నోయిడా, ఘజియాబాద్ వంటి ప్రాంతాల్లో ఎస్‌ఎస్‌పిగా పనిచేసిన కాలంలో నేర సామ్రాజ్యాన్ని అణచివేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన పనితీరును గుర్తించిన ప్రభుత్వం, ఇప్పుడు ఆయన సేవలను పశ్చిమ బెంగాల్‌ లో ఉపయోగించుకోవాలని నిర్ణయించింది. పశ్చిమ బెంగాల్‌ లో శాంతిభద్రతల సవాళ్లు ఎక్కువగా ఉన్న తరుణంలో, ఇంతటి అనుభవం ఉన్న అధికారిని అక్కడకు పంపడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read  : విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ చీప్ ట్రిక్స్..!

ఐదేళ్ల పాటు సాగే ఈ డిప్యుటేషన్ కాలంలో బెంగాల్‌లోని నేర రహిత వాతావరణం కోసం ఆయన తనదైన శైలిలో కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. యూపీలో సంచలనాలు సృష్టించిన ఈ అధికారి, బెంగాల్‌లో తన రెండో ఇన్నింగ్స్‌ ను ఎలా కొనసాగిస్తారో చూడాలి. పశ్చిమ బెంగాల్ లోని కొన్ని ప్రాంతాల్లో శాంతి భద్రతల సమస్య ఎక్కువగానే ఉంది. కూనీలు, కిడ్నాప్‌ లు, దోపిడీలు వంటి హింసాత్మక నేరాల రేటు జాతీయ సగటు కంటే ఇక్కడ ఎక్కువగా ఉందని నివేదికలు చెబుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్