Saturday, September 19, 2026 10:54 AM
Saturday, September 19, 2026 10:54 AM

యూత్‌కు టీటీడీ బ్రేక్ దర్శనం ఆఫర్.. కండీషన్ ఇదే..!

యువతలో ఆధ్యాత్మికతపై అవగాహన, ఆసక్తి పెంపొందించే లక్ష్యంతో అడుగులు వేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి, అధికారులు ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఆధ్యాత్మిక చైతన్యాన్ని, సనాతన ధర్మంపై అనురక్తిని కల్పించేందుకు గానూ.. రామకోటి తరహాలో గోవింద కోటిని ప్రవేశపెట్టింది. గోవింద కోటి రాసిన యువతకు వీఐపీ దర్శనాన్ని కల్పించాలని నిర్ణయించింది. 25 సంవత్సరాలు, లేదా అంతకంటే తక్కువ వయసున్న వారు ఇందుకు అర్హులుగా టీటీడీ అధికారులు ప్రకటించారు.

Also Read : మాడ్వీ హిడ్మా.. వైలేంట్ హిస్టరీ.. సిఎం అభ్యర్ధినే లేపేసిన చరిత్ర..!

ఈ నేపథ్యంలో పలు నిబంధనలను టీటీడీ అధికారికంగా ప్రకటించింది. 10,01,116 సార్లు రాస్తే రాసిన వారికి వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పిస్తామని ప్రకటించింది. కోటిసార్లు గోవింద నామాలు రాస్తే వారితోపాటు కుటుంబ సభ్యులందరికి వీఐపీ బ్రేక్‌ దర్శనం చేసుకోవచ్చని తెలిపారు. తితిదే సమాచార కేంద్రాలు, పుస్తక విక్రయ కేంద్రాలు, ఆన్‌లైన్‌లో గోవిందకోటి నామాల పుస్తకాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపిన అధికారులు.. 200 పేజీలుండే పుస్తకంలో 39,600 నామాలు రాయొచ్చని.. 10,01,116 నామాలు పూర్తి చేయడానికి దాదాపు 26 పుస్తకాలు అవసరం అవుతాయన్నారు. కోటి నామాల పుస్తకాలను రాయడానికి కనీసం మూడేళ్ల సమయం పడుతుందని టిటిడి సిబ్బంది వెల్లడించారు.

Also Read : సజ్జన్నార్ పై పవన్ ఆసక్తికర కామెంట్స్..!

గోవిందకోటి నామాల పుస్తకాన్ని పూర్తిచేసి తిరుమలలోని తితిదే పేష్కార్‌ ఆఫీసు లో అందిస్తే వారికి మరుసటి రోజు వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పిస్తారు. ఇదిలా ఉండగా.. వైకుంఠ ఏకాదశి పై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 30 నుండి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలని నిర్ణయించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇవ్వున్నారు. మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకే దర్శనం కల్పించనున్నారు. మొదటి మూడు రోజులు రూ.300, శ్రీవాణి దర్శనాలు రద్దు చేస్తారు. జనవరి 2 వ తేది నుండి 8వ తేది వరకు రోజుకు 15వేల రూ.300 దర్శన టిక్కెట్లు, 1000 శ్రీవాణి దర్శన టికెట్లు రెగ్యూలర్ పద్ధతిలో కేటాయింపులు ఉంటాయి.

Also Read : గోవా టూరిజం పడిపోయిందా..? లెక్కలు ఏం చెప్తున్నాయి..?

మొదటి మూడు రోజులకు ఈ-డిప్ ద్వారా కేటాయింపులు జరుగుతాయి. నవంబర్ 27 నుండి డిసెంబర్ 01 వ తేది వరకు దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ కు అవకాశం ఉంటుంది. డిసెంబర్ 2న డిప్ ద్వారా ఎంపికైన వారికి టోకెన్లు కేటాయింపు జరుగుతుంది. టీటీడీ వెబ్ సైట్, యాప్, వాట్సాప్ ద్వారా పారదర్శకంగా టోకెన్ల జారీకి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించారు. జనవరి 6,7,8 తేదిల్లో తిరుమల, తిరుపతి స్థానికులకు రోజుకు 5వేల టోకెన్లు కేటాయించారు. ఆన్ లైన్ లో ముందు బుక్ చేసుకున్న వారికి ముందు ప్రాతిపదికన టోకెన్లు కేటాయించారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

పోల్స్