Saturday, September 19, 2026 06:46 AM
Saturday, September 19, 2026 06:46 AM

రష్మిక – విజయ్ పెళ్ళికి వెళ్ళిన టాలీవుడ్ స్టార్లు వీళ్ళే..!

టాలీవుడ్ లో ఇప్పుడు లవ్ బర్డ్స్ గా ఉన్న స్టార్ పెయిర్ రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ.. మరో రెండు రోజుల్లో అఫీషియల్ గా దంపతులు కానున్నారు. రాజస్థాన్ లో లేక్ సిటీగా పాపులర్ అయిన ఉదయపూర్ లో వీరి వివాహం అత్యంత గ్రాండ్ గా జరగనుంది. ఈ వివాహం గురించి గత వారం రోజులుగా అనేక విషయాలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పటికే వివాహానికి హాజరయ్యే అతిధులు కూడా ఉదయపూర్ చేరుకున్నారు. తాజాగా సందీప్ రెడ్డి వంగా అక్కడికి వెళ్ళారు.

Also Read : కూర్గ్ లో విల్లా.. లగ్జరీ కార్లు.. రష్మిక – విజయ్ ఆస్తుల విలువ ఎంతంటే..?

ఇక తెలంగాణకు చెందిన పలువురు రాజకీయ నాయకులు కూడా వివాహానికి హాజరయ్యే అవకాశం ఉండవచ్చు. అలాగే హైదరాబాద్ లో జరిగే రిసెప్షన్ కు కూడా ప్రముఖులు హాజరు కానున్నారని సమాచారం. బుధవారం.. హల్ది, మెహందీ వేడుకలు జరుగుతాయని, ఈ వేడుకకు.. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరు కానున్నారు. ఈ రోజు సాయంత్రం సంగీత్ వేడుక కూడా జరిగే అవకాశం ఉంది. ఇక పెళ్లి రేపు ఉదయం 8 గంటలకు చేసుకోనున్నట్లు జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి.

Also Read : జగన్ ను తిట్టోద్దని పవన్ చెప్పారా..?

ఈ వివాహానికి ఓ కేంద్ర మంత్రి కూడా హాజరు అవుతారని జాతీయ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. తెలుగు, కొడవ సంస్కృతిలో ఈ వివాహం జరగనుంది. ఇదిలా ఉంటే రష్మిక, విజయ్, అతని సోదరుడు ఆనంద్ దేవరకొండ, వారి స్నేహితులు సోమవారం ఉదయం హైదరాబాద్ నుండి ఉదయపూర్ కు విమానంలో బయల్దేరి వెళ్ళారు. మంగళవారం నుంచి అతిధులు పెళ్ళికి వెళ్ళారు. వీరిలో పెళ్లి చూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్, ది గర్ల్ ఫ్రెండ్ దర్శకుడు రాహుల్ రవీంద్రన్, హీరోయిన్లు ఈషా రెబ్బా, ఆషికా రంగనాథ్, స్టైలిస్ట్ శ్రావ్య వర్మ కూడా ఉన్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

ఎల్‌నినో పై బాబు...

ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన కరవు పరిస్థితులను...

సనాతన ధర్మం.. చేప...

'దుర్గాపూజ సమయంలో బెంగాలీ హిందువులు మాంసాహారానికి...

వైసీపీలో విచిత్ర పరిస్థితి.....

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేడి...

నిర్ణయం చంద్రబాబు.. పవన్...

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై...

పోల్స్