Friday, May 1, 2026 05:49 AM
Friday, May 1, 2026 05:49 AM

కూర్గ్ లో విల్లా.. లగ్జరీ కార్లు.. రష్మిక – విజయ్ ఆస్తుల విలువ ఎంతంటే..?

టాలీవుడ్ స్టార్ జంట రష్మిక మందన్న – విజయ్ దేవరకొండ పెళ్లి ఏమో గాని.. వాళ్ళ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన అనేక విశేషాలు ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నెల 26 న వీళ్ళ వివాహం గ్రాండ్ గా జరగనుంది. తెలుగు, కన్నడ, హిందీ సినిమాలతో రష్మిక ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఇక తెలుగులో విజయ్ దేవరకొండ పెద్ద సక్సెస్ కాకపోయినా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. వారి ఆస్తులు, వారి వ్యాపారాలు ఒకసారి చూస్తే..

Also Read : పూల్ వాలీబాల్.. రష్మిక – విజయ్ పెళ్లి ఓ రేంజ్ లో..!

రష్మిక మందన్నకు హిందీలో కూడా మంచి ఇమేజ్ ఉంది. దీనితో నేషనల్ క్రష్ అనే ట్యాగ్ కూడా సొంతం చేసుకుంది. సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్స్ లో ఒకరుగా ఉన్నారు రష్మిక. డెక్కన్ క్రానికల్ ప్రకారం.. ఆమె నికర ఆస్తుల విలువ దాదాపు రూ.66 కోట్లు. ఆమె యావరేజ్ న ఒక్కో సినిమాకు.. దాదాపు రూ.4 కోట్లు వసూలు చేస్తుంది. తదుపరి సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, వ్యాపారాల విలువ దాదాపుగా మరో 30 కోట్ల రూపాయల వరకు ఉంటాయి.

లైన్ డియర్ అనే పర్ఫ్యూమ్ బ్రాండ్ కూడా ఆమె సొంతం. పుష్ప: ది రైజ్, పుష్ప: ది రూల్, చావా, యానిమల్ వంటి సినిమాలు ఆమె బ్రాండ్ వాల్యూ పెంచాయి. ఈమెకు దేశ వ్యాప్తంగా ఆస్తులు ఉన్నాయట. బెంగళూరులో రూ. 8 కోట్ల విలువైన ఇల్లు, హైదరాబాద్, ముంబై, గోవా, ఆమె స్వస్థలం కూర్గ్‌ లో కూడా ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది. కూర్గ్ విల్లా ధర రూ. 8 కోట్లుగా ఉంటుందని సమాచారం. కూర్గ్ లోని విరాజ్‌ పేటలో విల్లా నిర్మించుకున్నారు. లగ్జరీ కార్లు కూడా ఆమెకు భారీగానే ఉన్నాయి.

Also Read : తిరుమల పవిత్రతకు ప్రత్యేక చట్టం: బాబు సంచలన నిర్ణయం

రేంజ్ రోవర్ స్పోర్ట్, ఆడి క్యూ3, మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్, టయోటా ఇన్నోవా, హ్యుండయ్ క్రెటా కార్లు ఉన్నాయి. విజయ్ దేవరకొండ నికర ఆస్తుల విలువ రూ.66 కోట్ల నుండి రూ.70 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. లైఫ్‌స్టైల్ ఆసియా 2023లో అతని నికర ఆస్తుల విలువ రూ.66 కోట్లుగా పేర్కొన్నారు. డెక్కన్ క్రానికల్ 2026లో రూ.70 కోట్లుగా పేర్కొంది. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా భారీగా పెట్టుబడులు పెట్టాడు. విజయ్ ఒక్కో సినిమాకు రూ.12 కోట్ల నుండి రూ.15 కోట్ల వరకు తీసుకుంటాడట. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ కోసం దాదాపు రూ. 40 లక్షలు తీసుకుంటాడు విజయ్. అతను హైదరాబాద్ బ్లాక్ హాక్స్ వాలీబాల్ జట్టుకు సహ యజమాని కూడా. హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్‌ లో విజయ్‌కు దాదాపు రూ.15 కోట్ల విలువైన లగ్జరీ బంగ్లా ఉందని డెక్కన్ క్రానికల్ పేర్కొంది. అతనికి ఖరీదైన కార్లతో పాటు.. ప్రైవేట్ జెట్ కూడా ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

అబార్షన్ చట్టంపై సుప్రీంకోర్టు...

14 ఏళ్ల అత్యాచార బాధితురాలి అబార్షన్...

ఏపీ బ్రాండ్‌కి సచిన్‌...

నారా లోకేశ్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు చూడటానికి...

తల్లికి వందనం అప్పుడే.....

2026-27 విద్యా సంవత్సరం నేపథ్యంలో కూటమి...

మరో పార్టీ నేతను...

రాజకీయాల్లో ఇప్పుడు విపరీత ధోరణి కనిపిస్తోంది....

టెన్త్ ఫలితాల్లో లోకేష్...

ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్...

చేసిన పాపం.. కార్యకర్తల...

వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా మాజీ ఇన్ఛార్జ్...

పోల్స్