శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, శుక్ల పక్షం.. 28-06-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..
మేషం
ప్రముఖుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలలో కార్యజయం కలుగుతుంది. వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి.
—————————————
వృషభం
చేపట్టిన పనుల్లో కొంత జాప్యం తప్పదు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలించవు. ఇంటా బయట యుక్తిగా వ్యవహరించడం మంచిది. ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
—————————————
మిధునం
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు. ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. అనుకోని ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలొ అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
—————————————
కర్కాటకం
కుటుంబ విషయాలలో సొంత ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది.
—————————————
సింహం
ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహారించాలి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ముఖ్యమైన పనులలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
—————————————
కన్య
ఆదాయ మార్గాలు పెరిగి రుణాలు తీర్చగలుగుతారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.
—————————————
తుల
ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మిత్రుల నుంచి రుణాల ఒత్తిడులు పెరుగుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు కలుగుతాయి. నూతన ఋణయత్నాలు చేస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలున్నవి.
—————————————
వృశ్చికం
కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. నూతన వాహనయోగం ఉన్నది. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడగలుగుతారు.
—————————————
ధనస్సు
సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. బంధు మిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.
—————————————
మకరం
కీలక వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. భూసంబంధిత వివాదాలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆశించిన ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా సమానంగా ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.
—————————————
కుంభం
ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి ఉండదు.
—————————————
మీనం
దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. పలుకుబడి కలిగిన వారి పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.
—————————————
గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

