Friday, June 26, 2026 12:13 AM
Friday, June 26, 2026 12:13 AM

ఈరోజు రాశి ఫలితాలు (25-06-2026)

శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, నిజ జ్యేష్ఠ మాసం, శుక్ల పక్షం.. 25-06-2026 నాడు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటున్నారా, అయితే ఆ వివరాలు మీకోసం. మీ గ్రహాల ప్రభావం ఎలా ఉందో చెక్ చేసుకోండి..

మేషం

సంతాన అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగాలలో చికాకులు తప్పవు.

—————————————

వృషభం

సోదరులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఇంటాబయట ఒత్తిడులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు శ్రమాధిక్యంతో పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగుల కష్టం వృధాగా మిగులుతుంది.

—————————————

మిధునం

వాహన యోగం ఉన్నది. సన్నిహితుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలలో పురోగతి కలుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు కలుగుతాయి.

—————————————

కర్కాటకం

కుటుంబ విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు కొంత మందకొడిగా సాగుతాయి.

—————————————

సింహం

వ్యాపార వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

—————————————

కన్య

ఒక వ్యవహారంలో బంధువర్గంతో మాటపడవలసి వస్తుంది. దైవచింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో సమస్యలు చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు ముందుకు సాగవు. వృత్తి వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.

—————————————

తుల

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో ప్రతిష్ఠంభనలు తప్పవు. ఆస్తుల వివాదాలు వలన మానసిక సమస్యలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో వ్యయ ప్రయాసలు తప్పవు. మిత్రుల వలన సమస్యలు కలుగుతాయి. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు వాయిదాపడతాయి.

—————————————

వృశ్చికం

సన్నిహితుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగాలలో ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

—————————————

ధనస్సు

విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధన వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. దూరప్రాంతాల మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగస్థులకు పదోన్నతులు పెరుగుతాయి.

—————————————

మకరం

కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఉంటాయి.

—————————————

కుంభం

ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తాయి. సన్నిహితుల నుంచి ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఉద్యోగాలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి.

—————————————

మీనం

కుటుంబ సమస్యల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. దైవచింతన పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

————————————–

గమనిక : ఈ ఆర్టికల్‌లో అందించిన జ్యోతిష్య సమాచారం, వార్షిక ఫలాలు, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇది అందుబాటులో ఉన్న సమాచారం మేరకు అవగాహనా కొరకు ఇవ్వబడింది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు జ్యోతిష్య పండితులను సంప్రదించండి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

నదుల అనుసంధానంతో భారత్...

కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్...

పాస్‌పోర్ట్ జాతీయత కాదా..?...

భారతీయ పాస్‌పోర్ట్ అనేది కేవలం ఒక...

తిరుపతిలో భూమన భారీ...

వైసీపీ సీనియర్ నేత, టీటీడీ మాజీ...

ముగ్గురు సీఎంల చారిత్రాత్మక...

తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ...

లోకేష్ సంచలన ప్రకటన.....

అరుదైన వ్యాధులతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న...

సీఐ నాగరాజు రిమాండ్...

విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన గాదె...

పోల్స్