Wednesday, June 24, 2026 06:11 PM
Wednesday, June 24, 2026 06:11 PM

ఉక్రెయిన్‌ కు భారత సైన్యం..? వైట్ హౌస్ సీక్రెట్స్ లీక్..!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించే వ్యూహాలపై అమెరికా వైట్ హౌస్‌ లో జరిగిన ఒక అత్యున్నత స్థాయి రహస్య సమావేశానికి సంబంధించిన సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉక్రెయిన్‌ లో శాంతిని నెలకొల్పడానికి ఏకంగా భారత సైన్యాన్ని పంపుదాం అంటూ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ చేసిన ప్రతిపాదనను ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. న్యూయార్క్ టైమ్స్ ప్రముఖ జర్నలిస్టులు మాగీ హేబర్‌మన్, జోనాథన్ స్వాన్ సంయుక్తంగా రాసిన ‘రేజిం చేంజ్’ అనే సరికొత్త పుస్తకంలో ఈ టాప్ సీక్రెట్స్ బయటపడ్డాయి.

Also Read : బీసీసీఐపై గవాస్కర్ సంచలన కామెంట్స్..!

జనవరి 30న వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్‌ లో ప్రెసిడెంట్ ట్రంప్, వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మైక్ వాల్ట్జ్ తదితరులతో జరిగిన సమావేశంలో ఉక్రెయిన్ సంక్షోభంపై చర్చ నడిచింది. ఉక్రెయిన్‌ లో యుద్ధాన్ని ఆపిన తర్వాత అక్కడ శాంతిభద్రతలను పర్యవేక్షించడానికి నాటో లేదా అమెరికా బలగాలను పంపితే అది రష్యాను మరింత రెచ్చగొట్టినట్లు అవుతుందని జేడీ వాన్స్ అభిప్రాయపడ్డారు. దానికి బదులుగా రష్యాతో మంచి సంబంధాలు కలిగి ఉండి, అంతర్జాతీయంగా తటస్థంగా ఉండే భారత్ లేదా సౌదీ అరేబియా దేశాల సైన్యాన్ని ఉక్రెయిన్‌ కు పంపితే బాగుంటుందని ఆయన ఒక వ్యూహాత్మక ప్రతిపాదనను వైట్ హౌస్ ముందు ఉంచారు.

Also Read : సౌత్ కంటే.. బాలీవుడ్ చాలా బెటరంట..!

అయితే జేడీ వాన్స్ ప్రతిపాదనను డొనాల్డ్ ట్రంప్ వెంటనే తోసిపుచ్చారు. “భారతీయులు ఆ పని అస్సలు చేయరు.. ఇలాంటి వాటి కోసం వారు రూపాయి కూడా ఖర్చు పెట్టరు” అని ట్రంప్ స్పష్టం చేసినట్లు పుస్తకంలో పేర్కొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో తనకు అత్యంత ప్రాప్తమైన సంబంధాలు ఉన్నాయని, మోదీకి తనంటే ఎంతో ఇష్టమని చెప్తూనే.. అంతర్జాతీయ మిషన్ల కోసం భారత్ ఉచితంగా నిధులను, సైన్యాన్ని కేటాయించదని ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా-ఉక్రెయిన్ వివాదంలో భారత్ మొదటి నుంచి అత్యంత స్పష్టమైన వైఖరిని అవలంబిస్తోంది. ఏ సమస్య అయినా యుద్ధాల ద్వారా కాకుండా కేవలం దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కారం కావాలని భారత్ చెప్తూ వస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

సీఐ నాగరాజు రిమాండ్...

విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించిన గాదె...

నేనే చేసానని గ్యారెంటీ...

ఆంధ్రప్రదేశ్‌ లో తీవ్ర సంచలనం సృష్టించిన...

రేవంత్ సర్కార్ దెబ్బకు...

గత కొన్ని రోజులుగా తెలంగాణ ప్రభుత్వానికి,...

కాపులకు జగన్ నమ్మకద్రోహం.....

ముద్రగడ పద్మనాభం రాజకీయ జీవితంలో ఎన్నో...

సాయికృష్ణ అదృశ్యం కేసులో...

ఏపీలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ...

కూటమి సర్కార్ ప్రోగ్రెస్...

ప్రజా ప్రభుత్వం సాధించిన విజయాలు ప్రజల్లోకి...

పోల్స్