Sunday, June 21, 2026 06:08 PM
Sunday, June 21, 2026 06:08 PM

బీఎస్ 3 వాహనాలపై సుప్రీం సంచలన ఆదేశాలు..!

దేశ వ్యాప్తంగా వాహన కాలుష్యం పెరుగుతోన్న నేపధ్యంలో.. సుప్రీం కోర్ట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. చలికాలం వచ్చిందంటే చాలు కాలుష్య తీవ్రత మరింత ఆందోళన కలిగించే అంశంగా మారింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ.. పరిష్కారం మాత్రం లభించడం లేదు. పంట వ్యర్ధాలు కాల్చడం, భవన నిర్మాణాలు, పరిశ్రమల కాలుష్యం సహా అనేక అంశాలు ఇప్పుడు దేశాన్ని భయపెడుతున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది.

Also Read : రగిలిపోతున్న బాలయ్య ఫ్యాన్స్.. సంక్రాంతికి యుద్దమేనా..?

సుప్రీం కోర్ట్ వాహనాల కాలుష్యంపై కీలక ఆదేశాలు ఇచ్చింది. బీఎస్4 ఇంజిన్లు కలిగిన వాహనాలు మాత్రమే తిరుగుతున్నట్లు తేలితే వాటిపై చర్యలు తీసుకోకుండా మినహాయింపు ఇస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. డిసెంబర్ 18 నుండి 10 ఏళ్ల నాటి డీజిల్ వాహనాలు, 15 ఏళ్ల నాటి పెట్రోల్ వాహనాలను నిషేధిస్తూ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సవరించింది. దేశంలో పెట్రోల్‌ తో 15 ఏళ్ల నాటి వాహనాలు.. 10 ఏళ్ల నాటి డీజిల్ వాహనం బీఎస్-3 ఇంజిన్ కలిగిన వాహనాలకు మినహాయింపు లేదు.

Also Read : జగన్‌కు ఉహించని షాక్ ఇచ్చిన బాబు సర్కార్

వాటిపై రోడ్ల మీద తిరిగితే మాత్రం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. అంతకుముందు, ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, 10 ఏళ్లు పైబడిన డీజిల్, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోరాదని ఆదేశించింది. దీనితో కొంత అస్పష్టత ఏర్పడింది. అయితే తాజాగా కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ అభ్యర్థన మేరకు కోర్టు ఈరోజు ఈ వివరణ ఇచ్చింది. దేశ వ్యాప్తంగా ఈ నిర్ణయం అమలు చేసే అవకాశం కనపడుతోంది. భారత్‌ స్టేజ్ ఎమిషన్ నార్మ్స్ (BS) అనేది కాలుష్య నియంత్రణ ప్రమాణాలుగా చెప్తారు. 2010 నుంచి దేశ వ్యాప్తంగా అమలు చేస్తోంది కేంద్రం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

SBI వర్సెస్ తెలంగాణా...

రాయదుర్గం భూముల కేటాయింపు వ్యవహారంలో స్టేట్...

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

పోల్స్