Sunday, September 20, 2026 04:59 AM
Sunday, September 20, 2026 04:59 AM

మాట నిలబెట్టుకున్న లోకేష్

పోలీసు శాఖలో ఎప్పటి నుంచో పెండింగ్ లో కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియను ఏపీ సర్కార్ పూర్తి చేయడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. మొత్తం 6,100 మందిని రిక్రూట్‌ చేసుకునేందుకు నోటిఫికేషన్‌ జారీ చేయగా అందులో 6,014 మందిని సెలెక్ట్ చేసారు. ఇక వీరిలో 5,757 మంది ట్రైనింగ్‌కు ఎంపిక చేసారు. ఇక సివిల్‌ కానిస్టేబుళ్లుగా 3,343 మంది, ఏపీఎస్‌పీ కానిస్టేబుళ్లుగా 2,414 మంది ఎంపిక కాగా.. సివిల్‌ లో మహిళా కానిస్టేబుళ్లు 993 మంది ఉండటం విశేషం. వీరందరికీ ఈ నెల నుంచి ట్రైనింగ్‌ కార్యక్రమం మొదలు కానుంది.

Also Read : బ్రేకింగ్: వివేకా కేసులో జగన్ నిర్దోషి..?

కొద్ది నెలల క్రితం మెగా డీఎస్సీ నిర్వహించి 15,941 మందికి ఉద్యోగాలు సర్కార్ ఉద్యోగాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంచితే.. కానిస్టేబుల్ నియామకాల విషయంలో మంత్రి నారా లోకేష్.. యువగళం పాదయాత్రలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై లోకేష్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేసారు. కానిస్టేబుల్ పోస్టుల భర్తీని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, తన హామీని నెరవేర్చేందుకు కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియను ఒక యజ్ఞంలా చేపట్టి పూర్తిచేసిన హోంమంత్రి వంగలపూడి అనితకు లోకేష్ ధన్యవాదాలు చెప్పారు.

Also Read : జగన్‌కు ఉహించని షాక్ ఇచ్చిన బాబు సర్కార్

ఈ పోస్టుల భర్తీని అడ్డుకునేందుకు వేసిన కుట్రపూరిత కేసులను అత్యంత చాకచక్యంగా పరిష్కరించడం వెనుక అధికార యంత్రాంగానికి హోంమంత్రి పూర్తి సహాయ, సహకారాలు అందించారని, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన హోంమంత్రికి, అధికార, పోలీసు యంత్రాంగానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. నిన్న కానిస్టేబుల్స్ కు రాష్ట్ర ప్రభుత్వం నియామక పత్రాలు అందించిన సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుమల లడ్డూ పై,...

ఈడీ అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.. ఈ...

ఇప్పటికీ వారికే పదవులు.....

కూటమి ప్రభుత్వం ఏర్పడి, దాదాపు రెండున్నర...

సాయిరెడ్డి.. నెట్టుకు రాగలరా.....

కొత్త ఎపుడూ వింతే. అందుకే కొత్తగా...

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

పోల్స్