Sunday, September 6, 2026 10:29 PM
Sunday, September 6, 2026 10:29 PM

నిమ్మగడ్డ కొంప ముంచిన జగన్ స్నేహం..!

ఒకప్పుడు YS జగన్‌తో ఉన్న పరిచయాలు, వ్యాపార సంబంధాలే ఇప్పుడు ప్రముఖ వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కొంపముంచాయా? అంటే ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే అనాల్సి వస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్‌తో ఉన్న సాన్నిహిత్యం, ఆయన కంపెనీల్లో పెట్టిన పెట్టుబడుల పుణ్యమా అని నిమ్మగడ్డ ప్రసాద్ CBI, ED కేసుల్లో చిక్కుకుని నానా పాట్లు పడ్డారు. ఇప్పుడు అదే కోవలో వాన్‌పిక్ ప్రాజెక్ట్ చిక్కులు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఈ కేసులో నిమ్మగడ్డ ప్రసాద్‌కు సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగలింది.

Also Read : అయ్యన్న పాత్రుడి అలుపెరుగని రాజకీయ ప్రస్థానం

వాన్‌పిక్ ప్రాజెక్ట్ కోసం దుబాయ్‌కి చెందిన రస్‌అల్‌ఖైమా ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ – RAKIA నుంచి భారీగా పెట్టుబడులు తెచ్చిన నిమ్మగడ్డ ప్రసాద్, ఆ సంస్థను మోసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. నాటి రాజకీయ పెద్దల అండతో సాగిన ఈ ప్రాజెక్ట్ ఒప్పందాలే ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకున్నాయి. రస్‌అల్‌ఖైమా సంస్థకు వడ్డీతో సహా రూ.543 కోట్లకు పైగా చెల్లించాలని విదేశీ కోర్టు ఎప్పుడో తీర్పు చెప్పింది. అయితే ఆ తీర్పు మన దేశంలో అమలు కాకుండా అడ్డుకోవడానికి, తన ఆస్తులను వేర్వేరు కంపెనీల పేరిట దాచిపెట్టడానికి నిమ్మగడ్డ చేసిన ప్రయత్నాలను సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది.

Also Read : ప్లేట్ తిప్పేసిన రాజగోపాల్ రెడ్డి.. రేవంత్ కు జై..!

జగన్‌తో నడిపిన స్నేహం, నాటి ప్రభుత్వాల హయాంలో కుదిరిన అనుమానాస్పద ఒప్పందాల కారణంగానే నిమ్మగడ్డ ప్రసాద్ ఈ విదేశీ చిక్కుల్లో పూర్తిగా ఇరుక్కుపోయారనే చెప్పాలి. ఆ సంస్థకు ఇవ్వాల్సిన బకాయిలు వడ్డీతో కలిపి ఇప్పుడు దాదాపు రూ.950 కోట్లకు చేరాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రూ.231 కోట్లు, కొన్ని భూములు, ఆస్తులను అటాచ్ చేసినప్పటికీ.. అదనంగా మరో రూ.200 కోట్లను రెండు వారాల్లోపు కోర్టులో డిపాజిట్ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

హైదరాబాద్, రంగారెడ్డి కోర్టులు ఈ కేసుపై 4 నెలల్లోపు తుది నిర్ణయం చెప్పాలని సర్వోన్నత ధర్మాసనం ఆదేశించింది. అంతేకాకుండా, నిమ్మగడ్డ కుటుంబ సభ్యుల కంపెనీల ముసుగు తొలగించి మరీ..బాకీలు వసూలు చేసే అంశంపై స్థానిక కోర్టులే స్వయంగా నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు తెగేసి చెప్పింది. మొత్తంగా వైఎస్‌ జగన్‌తో అంటకాగి తెచ్చుకున్న కష్టాలు, ఆనాడు చేసుకున్న ఒప్పందాలే నేడు నిమ్మగడ్డ ప్రసాద్‌ను నిలువునా ముంచుతున్నాయి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

గుహలోంచి బయటకొచ్చిన కూన.....

నందమూరి అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త...

‘దాదా’గా వస్తున్న బాలయ్య.....

నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్...

ప్లేట్ తిప్పేసిన రాజగోపాల్...

తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో గత కొంతకాలంగా...

ఏపీ ఉద్యోగులకు సీఎం...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సుదీర్ఘకాల సమస్యల...

టీవీకే టార్గెట్‌లో డీఎంకే...

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త రణం మొదలైంది....

ఏపీ రాజకీయాల్లో బిగ్...

ఏపీ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నాయకుడు,...

పోల్స్