Thursday, July 23, 2026 07:30 PM
Thursday, July 23, 2026 07:30 PM

బండ్ల గణేష్‌ కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు..!

టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రుణ ఎగవేత వివాదంలో ఆయనకు చెందిన విలువైన ఆస్తిని బ్యాంక్ అధికారులు వేలం వేయడం పూర్తిగా చట్టబద్ధమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో ఈ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బండ్ల గణేష్ దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వులనే సమర్థిస్తూ బండ్ల గణేష్ పిటిషన్‌ను కొట్టివేసింది.

Also Read : రా ఎన్టీఆర్ వివాదం.. సేవ వెనుక అసలు కథేంటి..?

ఈ వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. బండ్ల గణేష్ మరియు ఆయన కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోని శ్రీ పరమేశ్వర పౌల్ట్రీ ఫామ్ ప్రైవేట్ లిమిటెడ్.. సంస్థ పేరుతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి భారీగా రుణాలు తీసుకున్నారు. అయితే, ఆ రుణాలను సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు వారిని డిఫాల్టర్లుగా ప్రకటించారు. అప్పు రికవరీ ప్రక్రియలో భాగంగా, బండ్ల గణేష్ మరియు ఆయన తండ్రి పర్సనల్ గ్యారెంటీగా ఉంచిన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్న నివాస భవనాన్ని 2022లో బ్యాంక్ అధికారులు దాదాపు రూ. 8.50 కోట్లకు వేలం వేశారు.

Also Read : ఆ జిల్లాలో వైసీపీ ఇక కష్టమే..!

ఈ వేలం ప్రక్రియను సవాల్ చేస్తూ మొదట డెట్ రికవరీ ట్రిబ్యునల్ లో బండ్ల గణేష్ అనుకూల ఉత్తర్వులు పొందినప్పటికీ, ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు ఆ ఉత్తర్వులను తిరగరాసింది. సార్ఫేసి చట్టం ప్రకారం బ్యాంక్ తీసుకున్న ఆస్తి వేలం చర్య పూర్తిగా సరైనదేనని హైకోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ నిబంధనల ఆధారంగా బండ్ల గణేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడ కూడా ఆయనకు ఊరట దక్కలేదు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదని స్పష్టం చేస్తూ సుప్రీంకోర్టు ఈ వివాదానికి పూర్తిగా తెరదించింది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తల్లికి వందనం షురూ.....

ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి...

జక్కంపూడికి మూడిందా..? అరెస్ట్...

రాజమహేంద్రవరం కేంద్రంగా వైసీపీ కీలక నేత,...

యుద్ధం కొనసాగితే 9/11...

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు...

సీజేపీ చీఫ్ అభిజిత్...

నీట్ పరీక్షల పేపర్ లీకేజీ వ్యవహారానికి...

వెలుగులోకి మరో వైసీపీ...

నీతి, నిజాయతీ అంటూ మాటలు చెప్పే...

అమరావతి నిర్మాణంలో కీలక...

నవ్యాంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతి పునర్నిర్మాణ...

పోల్స్