Wednesday, May 6, 2026 09:49 PM
Wednesday, May 6, 2026 09:49 PM

బ్రేకింగ్: హైవేల్లో దాబాలపై సుప్రీం గురి.. ప్రభుత్వాలకు నోటీసులు..!

దేశ వ్యాప్తంగా గత కొన్నాళ్ళుగా రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల తెలంగాణా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 100 నుంచి 120 మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. దీనితో రోడ్లపై భద్రత లేదనే అభిప్రాయాలు.. ప్రభుత్వ రవాణా వ్యవస్థ బలంగా లేదనే కామెంట్స్, పోలీసుల నిఘా సరిగా లేదనే విమర్శలు ఇలా ఎక్కువగా వినపడుతూ వచ్చాయి. దీనిపై సుప్రీం కోర్ట్, కేంద్రం జోక్యం చేసుకోవాలనే డిమాండ్ లు పెద్ద ఎత్తున వినపడుతున్నాయి.

Also Read : జూబ్లీహిల్స్‌లో టీడీపీ ఓట్లు ఎవరికి..?

ఈ నేపధ్యంలో దీనికి సంబంధించి జరిగిన విచారణలో సుప్రీం కోర్ట్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. తెలంగాణాలో, రాజస్థాన్ లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో రెండు రోజుల్లో 40 మంది ప్రాణాలు కోల్పోవడాన్ని సీరియస్ గా తీసుకున్న సుప్రీం కోర్ట్ రాజస్థాన్‌, తెలంగాణ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. రెండు రాష్ట్రాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో రోడ్డు ప్రమాదాలపై నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఏఐ, కేంద్ర రవాణా శాఖకు ఆదేశాలు జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం.

Also Read : పెద్దిరెడ్డి అక్రమాల వీడియోలు తీయించానన్న పవన్.. సూపరన్న చంద్రబాబు..!

ఈ సందర్భంగా రోడ్లపై నిర్వహించే దాబాల గురించి సుప్రీం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హైవేలపై అనుమతి లేకుండా ఎన్ని దాబాలు ఉన్నాయో సర్వే చేయాలని ఆదేశించింది. హైవేల కండిషన్‌ పై నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. మెయింటెనెన్స్‌ సమయంలో కాంట్రాక్టర్లు తగిన ప్రమాణాలు పాటించారో లేదో వెల్లడిoచాలన్న సుప్రీంకోర్టు.. తెలంగాణ, రాజస్థాన్‌లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 40 మంది మృతి చెందారని, ఈ విషయాన్ని తేలికగా చూడలేమని పేర్కొంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

లోకేష్ సంచలన నిర్ణయం,...

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో భారీ మార్పులకు శ్రీకారం...

ముఖ్యమంత్రి కాన్వాయ్‌ పై...

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన...

ఏపీకి మరో దిగ్గజ...

ఏపీకి అంతర్జాతీయ పరిశ్రమలు క్యూ కడుతున్నాయి....

ఇన్ అండ్ అవుట్.....

తెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి రెండున్నరేళ్లు...

ఏపీ ఐపీఎస్ ను...

ఆంధ్రప్రదేశ్‌ లో సంచలనం సృష్టించిన సినీ...

విజయ్ చుట్టూ ఏపీ..వైసీపీ...

తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ...

పోల్స్