Saturday, September 19, 2026 11:02 AM
Saturday, September 19, 2026 11:02 AM

HCU భూముల్లో కీలక పరిణామం, రేవంత్ కు షాక్ తప్పదా..?

తెలంగాణతో పాటుగా దేశ వ్యాప్తంగా సంచలనమైన కంచే గచ్చిబౌలి భూముల వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ వ్యవహారంలో సుప్రీం కోర్ట్ కూడా రంగంలోకి దిగిన నేపధ్యంలో ఏ పరిణామాలు ఉండబోతున్నాయి అనేది ఆసక్తిగా మారింది. ఇక దీనిపై రాజకీయ దుమారం కూడా రేగడంతో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం వేరే లెవెల్ లో ఉంది. బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు కాంగ్రెస్ పార్టీ అదే రేంజ్ లో సమాధానం ఇస్తోంది.

Also Read : జగన్ పై అనిత సంచలన కామెంట్స్.. వాట్సాప్ మెసేజ్ లపై కీలక వ్యాఖ్యలు 

ఇక ఈ వ్యవహారంలో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను పరిశీలించేందుకు హైదరాబాద్ చేరుకుంది సుప్రీం కమిటీ. కంచ గచ్చిబౌలి లోని 400 ఎకరాల వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తరుణంలో ఈ పరిణామం కీలకంగా మారింది. దీనిపై క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి నివేదిక అందజేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఇటీవల కమిటీకి ఆదేశాలు జారీ చేసింది.

Also Read : 2019 వ్యూహమే జగన్ ప్లాన్ చేసారా..? చింతమనేని అలెర్ట్ గా ఉండాల్సిందే

వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేసేందుకు బుధవారం సాయంత్రం 7:45 గంటలకు పర్యావరణ, అటవీ శాఖల సాధికారిక కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్, మరో ముగ్గురు సభ్యులు ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఉదయం 10 గంటలకు గచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సుప్రీంకోర్టు పరిధిలోని సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చేరుకుంది. కంచె గచ్చిబౌలి భూముల్లో క్షేత్రస్థాయి పరిశీలన, వాస్తవ పరిస్థితుల అధ్యయనం, మధ్యాహ్నం 2 గంటలకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశం కానుంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

25 రోజుల తర్వాత...

ఏపీ డిప్యూటి సీఎం, జనసేన అధినేత...

ఏపీలో మద్యం షాపుల...

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను...

బాంబు పేల్చిన టీడీపీ...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ...

ఏపీ లిక్కర్ కుంభకోణం.....

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత వైఎస్సార్ కాంగ్రెస్...

రేవంత్ దెబ్బ.. బీఆర్ఎస్‌కు...

ఏదో అనుకుంటే.. మరేదో జరిగినట్లు ఉంది...

దానం నాగేందర్ కు...

ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ...

పోల్స్