Thursday, September 17, 2026 10:45 PM
Thursday, September 17, 2026 10:45 PM

వారణాసి ఇంత ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నాడా..?

ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, గ్లోబల్ వైడ్ గా భారీ అంచనాలతో రూపుదిద్దుకుంటున్న ఏకైక క్రేజీ ప్రాజెక్ట్ వారణాసి. టాలీవుడ్ కీర్తిని బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌ పై కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ అడ్వెంచరస్ చిత్రంపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

Also Read : చిరంజీవి డిజిటల్ జర్ని స్టార్ట్..!

దాదాపు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్‌ తో హాలీవుడ్ రేంజ్‌ లో విజువల్ వండర్‌ గా ఈ ప్రాజెక్ట్ సిద్ధమవుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేసే ఒక అద్భుతమైన అప్డేట్ బయటకు వచ్చింది. వారణాసి చిత్రం ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్‌ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన పాటలు, రామాయణ బ్యాక్‌ డ్రాప్ ఎపిసోడ్స్, అంటార్కిటికాతో పాటు దట్టమైన అడవుల్లో సాగే అడ్వెంచరస్ సీన్స్ అన్నింటినీ జక్కన్న పక్కా ప్లానింగ్ తో పూర్తి చేసేశాడు.

Also Read : వంగ మాస్టర్ ప్లాన్.. కాస్టింగ్‌ తోనే బాక్సాఫీస్‌ షేక్..!

ఇక జూన్ చివరి వారం నుంచి ఈ సినిమా సరికొత్త, అత్యంత కీలకమైన లాంగ్ షెడ్యూల్‌ ను జరుపుకోనుంది. ఈ ఫైనల్ షెడ్యూల్‌ లో సినిమాలోని ప్రధాన యాక్షన్ బ్యాక్‌ డ్రాప్ సీన్స్‌ ను తెరకెక్కించి, టాకీ పార్ట్ మొత్తాన్ని క్లోజ్ చేయాలని రాజమౌళి పట్టుదలతో ఉన్నాడు. ఈ సినిమా కోసం మహేష్ బాబు కూడా మునుపెన్నడూ లేనంతగా శ్రమిస్తున్నాడు. పాత్ర డిమాండ్ మేరకు మహేష్ కలరిపయట్టు అనే మార్షల్ ఆర్ట్స్‌ను నేర్చుకోవడంతో పాటు, అద్భుతమైన బాడీ ట్రాన్స్ఫర్మేషన్‌ తో సరికొత్త లుక్‌ లో కనిపించబోతున్నాడు. రాజమౌళి తన హిస్టరీలోనే ఈ రేంజ్ లో ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్