జరిగింది ఘోరం.. అత్యంత నీచమైన చర్య.. అందుకు సంబంధించిన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలను మీడియాకు వివరించారు పోలీసులు. ఇంత వరకు బాగానే ఉంది. ఇందులో తప్పుపట్టాల్సిన అంశం ఏమీ లేదు. దారుణం జరిగిన 24 గంటల్లోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. ఈ దారుణం గురించి మీడియాకు వివరించే క్రమంలో పోలీసు ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరు ఇప్పుడు సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఇంకా చెప్పాలంటే.. అత్యంత అమానవీయ ఘటనను పోలీసులు వివరిస్తున్న తీరు ప్రజలకు చిరాకు పుట్టించింది కూడా. తక్షణమే ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు కూడా మొదలయ్యాయి.
Also Read : కమ్మ నేతకు రాజ్యసభ..? ఆ ఒక సీటు ఎవరికి..?
తమిళనాడులోని కోయంబత్తూర్‌లో పదేళ్ల బాలికను అత్యాచారం చేసి చంపిన కేసు తీవ్ర దుమారం రేపింది. ఈ దారుణ ఘటనపై సీఎం విజయ్ సైతం ఘాటుగా స్పందించారు. దారుణానికి ఒడిగట్టిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్వత్రా డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దారుణం జరిగిన 24 గంటల్లోనే నిందితులను అరెస్టు చేశారు. దీంతో ప్రజలు, ప్రతిపక్షాలు సైలెంట్ అయ్యాయి. అయితే.. అగ్నికి ఆజ్యం పోసీనట్లుగా పోలీసు ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరు ఇప్పుడు సర్వత్రా విమర్శలకు తెర లేపింది.

నిజానికి ఈ కేసుకు సంబంధించి టీవీకే పారిశ్రామిక మంత్రి ఎస్.కీర్తన తీరుపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసు గురించి పాత్రికేయులు ప్రశ్నలు అడుగుతుంటే.. కీర్తన నవ్వుతూ జవాబిచ్చారు. ఈ వీడియో మీడియాలో రావడంతో.. బీజేపీ, డీఎంకే సహా అన్ని పార్టీల నేతలు మంత్రి కీర్తన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతుంటే.. మరోవైపు ఇదే అంశంపై మంత్రి ప్రవర్తించిన విధానం నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపిస్తున్నారు. పదేళ్ల చిన్నారి దారుణ హత్యకు గురైతే.. మహిళా మంత్రికి నవ్వు ఎలా వస్తుందని బీజేపీ నేతలు ప్రశ్నించారు. ఆమె ఈ ఘోరాన్ని చాలా తేలికగా తీసుకున్నారని అసహనం వ్యక్తం చేశారు.
Also Read : తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్..!
ఇక ఈ కేసుకు సంబంధించిన వివరాలను కోయంబత్తూర్‌లోని పోలీసులు మీడియా సమావేశంలో వివరించారు. సున్నితమైన పిల్లల హత్య కేసును పరిష్కరిస్తున్నప్పుడు అధికారులు ఎంతో హుందాగా వ్యవహరించాలి. కానీ ఈ సమావేశంలో మాత్రం.. ఉన్నతాధికారులు నవ్వుతూ కనిపించడం, స్థాయి మరిచి ప్రవర్తించడం ప్రజల ఆగ్రహానికి కారణమవుతోంది. చిన్నారిపై దారుణం జరిగితే.. పోలీసులు కనీకరం లేకుండా వ్యవహరించారని సోషల్ మీడియా వేదికగా విమర్ళలు వెల్లువెత్తుతున్నాయి. చట్టాన్ని అమలు చేసే అధికారులు అనుచితంగా ప్రవర్తించారని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా మీడియా సమావేశంలో ఈ కేసు గురించి వివరిస్తూ.. ఓ మహిళా ఐజీ నవ్వుతూ కనిపించారు. గోళ్లు రాస్తూ.. నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
పోలీసులు వ్యవహరించిన తీరు.. బాధిత కుటుంబాలను మరింత క్షోభకు గురి చేసేలా ఉన్నాయని నెటిజన్లు విమర్శిస్తున్నారు. తక్షణమే ఇలా తప్పుగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రెస్ మీట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. అసలేం జరిగిందనే అంశంపై ఆరా తీస్తున్నారు.
పలువురు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు మరియు సంఘటన చుట్టూ ఉన్న పరిస్థితులకు సంబంధించి పోలీసు శాఖ నుండి వివరణ కోరారు. పిల్లల మరణానికి సంబంధించిన కేసులో ఇటువంటి ప్రవర్తన పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. ఇది చాలా సున్నితమైన విషయంగా అభివర్ణిస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపి పోలీసు శాఖ గౌరవాన్ని నిలబెట్టేందుకు, ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

