Wednesday, August 5, 2026 08:45 AM
Wednesday, August 5, 2026 08:45 AM

అరెస్ట్ కోహ్లీ.. సోషల్ మీడియాలో సంచలనం

బెంగళూరులో జరిగిన తొక్కిసలాట ఘటన విషయంలో సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయోత్సవ వేడుకలు జరుపుకోవడానికి బెంగళూరు వెళ్ళగా.. అక్కడ చోటు చేసుకున్న ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై కర్ణాటక హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక బెంగళూరు పోలీస్ కమిషనర్ తో పాటుగా పలువురు అధికారులు పై కూడా కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇక ఇదే సమయంలో పలువురు ఆటగాళ్లపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి.

Also Read : ఆర్సీబీ సంచలన నిర్ణయం

ఇక అక్కడికి వచ్చిన వారిలో విరాట్ కోహ్లీ అభిమానులు ఎక్కువగా ఉండటంతో కోహ్లీ పై విమర్శలు చేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్. దీనిపై సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ లు కూడా ట్రెండింగ్ లో ఉన్నాయి. విరాట్ కోహ్లీని అరెస్టు చేయాలంటూ అరెస్టు కోహ్లీ అనే ట్యాగ్ విస్తృతంగా వైరల్ అవుతుంది. కోహ్లీ కారణంగానే అభిమానులు అంతమంది వచ్చారని.. కాబట్టి దీనికి బాధ్యతగా కోహ్లీని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం వెంటనే కోహ్లీని అదుపులోకి తీసుకుని విచారించాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read : కరోనా.. శాస్త్రవేత్త సంచలన కామెంట్స్

అలాగే మృతల కుటుంబాలకు విరాట్ కోహ్లీ భారీగా ఆర్థిక సహాయం చేయాలనే డిమాండ్ కూడా వినపడుతోంది. ఇదిలా ఉంచితే ఈ ఘటనలో మరణించిన వారికి ఆర్సిబి యాజమాన్యం ఒక్కొక్కరికి పది లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేసింది. గాయపడిన వారికి కూడా అండగా ఉంటామని ప్రకటించిన సంగతి తెలిసిందే. కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఆర్సిబి యాజమాన్యానికి అండగా ఉందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ విషయంలో కూడా సోషల్ మీడియాలో పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

వైసీపీ లో బోరుగడ్డ...

అధికారంలో ఉన్నప్పుడు కళ్లు నెత్తికి ఎక్కాయి....

రాజకీయాల్లోకి త్రిష..? సీఎం...

తమిళనాడు రాజకీయాల్లో గత రెండు రోజులుగా...

జగన్ పర్యటన దెబ్బ.....

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...

బ్రేకింగ్: విజయ్ పై...

తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా తీవ్ర ఉత్కంఠగా...

దమ్ముంటే పట్టుకోండి చూద్దాం.....

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలో ఉందో.....

మళ్లీ మొదలైన కావేరీ...

దక్షిణ భారతదేశంలో దశాబ్దాలుగా నలుగుతున్న కావేరీ...

పోల్స్