Thursday, September 17, 2026 05:22 PM
Thursday, September 17, 2026 05:22 PM

గిల్ కు అవార్డు.. రగిలిపోతున్న రోకో ఫ్యాన్స్..!

భారత క్రికెట్ లో ఇటీవలి పరిణామాలు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. తాజాగా భారత స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కు ఇటీవల బీసీసీఐ వార్షిక అవార్డులలో అత్యున్నత పురస్కారాన్ని అందుకోవడం క్రీడా వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన నమన్ అవార్డ్స్ వేడుకలో గిల్‌ కు పాలీ ఉమ్రిగర్, ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ అవార్డు ఇవ్వడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ 2026 జట్టులో గిల్‌ కు చోటు దక్కలేదు. పేలవమైన స్ట్రైక్ రేట్, నిలకడలేని ప్రదర్శన కారణంగా అతడిని జట్టు నుంచి తప్పించారు.

Also Read : వన్డేలపై సూర్య కుమార్ సంచలన కామెంట్స్..!

టీ20ల్లో విఫలమైనప్పటికీ, అతడికి ‘క్రికెటర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు ఇవ్వడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అవార్డుల ప్రదానోత్సవం సమయంలో బ్రాడ్‌ కాస్టర్లు చేసిన తప్పు కూడా విమర్శలకు దారి తీసింది. స్క్రీన్‌ పై గిల్ పేరును ప్రదర్శించే సమయంలో, అతడిని ‘ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విన్నింగ్ కెప్టెన్’ గా ప్రస్తావించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. వాస్తవానికి రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ ఆ ట్రోఫీ గెలుచుకుంది. ఈ పొరపాటు రోహిత్, కోహ్లీ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది.

Also Read : రోహిత్ రెడ్డిపై కేసీఆర్ సీరియస్.. సస్పెండ్ ఖాయమే..?

2025లో ఇంగ్లండ్‌ తో జరిగిన టెస్ట్ సిరీస్‌ లో గిల్ 754 పరుగులు చేసి సత్తా చాటాడు. మొత్తం టెస్టుల్లో 983 పరుగులు సాధించాడు. అయితే అతను ఆస్ట్రేలియాలో విఫలం కావడం పట్ల తీవ్ర విమర్శలు ఉన్నాయి. టెస్టులు, వన్డేలలో ఆస్ట్రేలియాలో అతను విఫలం కావడం, బౌలింగ్ కు అనుకూలంగా ఉండే పిచ్ లపై రాణించలేకపోవడం, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు చేతులేత్తేయడంపై కూడా విమర్శలు వచ్చాయి. ఇప్పటి వరకు అతని కెరీర్ లో డూ ఆర్ డై మ్యాచ్ లలో అంచనాలకు తగ్గట్టుగా రాణించింది లేదు. 2023 ప్రపంచకప్ ఫైనల్ లో అతను ఫెయిల్ కావడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. టి20 లలో కూడా కీలక మ్యాచ్ లలో అతను ఫెయిల్ కావడంతో అభిమానులు గిల్ విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్