Friday, June 19, 2026 05:12 AM
Friday, June 19, 2026 05:12 AM

రోహిత్ రెడ్డిపై కేసీఆర్ సీరియస్.. సస్పెండ్ ఖాయమే..?

ప్రజల్లోకి వెళ్లేందుకు కష్టపడుతోన్న భారత రాష్ట్ర సమితికి ఇటీవలి పరిణామాలు తలనొప్పిగా మారాయి. తాజాగా పైలెట్ రోహిత్ రెడ్డి వ్యవహారంతో అధిష్టానం విమర్శలు ఎదుర్కొంటుంది. ఇక ఈ కేసు విషయంలో పైలట్ రోహిత్ రెడ్డికి ఓ వైపు ఉచ్చు బిగుస్తోన్న సంగతి తెలిసిందే. ఇక మరో వైపు.. డ్రగ్స్ వినియోగానికి సంబంధించిన ఆరోపణలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్న తరుణంలో, పార్టీ అధినేత కేసీఆర్ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించేలా, పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారనే కారణంతో ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేశారు కేసీఆర్.

Also Read : వన్డేలపై సూర్య కుమార్ సంచలన కామెంట్స్..!

మీడియాలో వస్తున్న డ్రగ్స్ వినియోగం ఆరోపణలపై వారం రోజుల్లోగా స్పష్టమైన లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని కేసీఆర్ ఆదేశించారు. ఒకవేళ నిర్ణీత గడువులోగా సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోతే, పార్టీ నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పార్టీ నుంచి బహిష్కరించే అవకాశం ఉందని నోటీసులో హెచ్చరించారు. ప్రజాప్రతినిధులుగా ఉన్నవారు సమాజంలో ఆదర్శంగా ఉండాలని, ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం వల్ల పార్టీ క్యాడర్‌లో తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని అధిష్టానం భావిస్తోంది.

Also Read : అమరావతిలో అమరజీవికి అద్బుత నివాళి..!

గతంలో కూడా రోహిత్ రెడ్డి పేరు బెంగళూరు డ్రగ్స్ కేసులో మరియు ఇతర దర్యాప్తు సంస్థల విచారణలో వినిపించింది. అయితే, తాజాగా మీడియాలో వస్తున్న కథనాలు, దర్యాప్తు సంస్థల కదలికల నేపథ్యంలో పార్టీకి నష్టం జరగకుండా ఉండేందుకు కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ షోకాజ్ నోటీసు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. రోహిత్ రెడ్డి ఈ నోటీసుపై ఎలా స్పందిస్తారు? ఆయన ఇచ్చే వివరణతో కేసీఆర్ సంతృప్తి చెందుతారా? లేదా ఆయనపై వేటు పడుతుందా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పైలెట్ రోహిత్ రెడ్డి ఇప్పటికే రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

ప్రజల్లోకి వెళ్ళాల్సిందే.. చంద్రబాబు...

ఏపీలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్న...

బ్రేకింగ్: లోకేష్ సంచలన...

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుర్చీలో...

భయపడాల్సిన వారేమో భయపెడుతున్నారు.. భయపెట్టాల్సిన వారేమో...

పోల్స్