Thursday, September 17, 2026 04:38 PM
Thursday, September 17, 2026 04:38 PM

వన్డేలపై సూర్య కుమార్ సంచలన కామెంట్స్..!

టి20 వరల్డ్ కప్ గెలిచి, జోష్ మీదున్న టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మిగిలిన ఫార్మాట్ల గురించి ఆసక్తికర కామెంట్స్ చేసాడు. తన వన్డే, టెస్టు కెరీర్‌ పై నేడు ఆసక్తికర కామెంట్స్ చేసాడు. టీ20ల్లో మంచి ప్రదర్శన చేస్తున్నప్పటికీ, మిగిలిన రెండు ఫార్మాట్లలో తాను ఆశించిన స్థాయిలో రాణించలేకపోయానని అంగీకరించాడు సూర్య. ప్రపంచవ్యాప్తంగా టీ20ల్లో ‘మిస్టర్ 360’గా పేరు తెచ్చుకున్న సూర్యకుమార్ యాదవ్, వన్డే ఫార్మాట్లో ఫెయిల్ కావడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.

Also Read : అమరావతిలో అమరజీవికి అద్బుత నివాళి..!

సూర్యకుమార్ వన్డే క్రికెట్‌ ను అత్యంత కష్టతరమైన ఫార్మాట్‌ గా అభివర్ణించాడు. వన్డేల్లో పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయడం చాలా క్లిష్టంగా ఉంటుందన్నాడు. వికెట్లు త్వరగా పడితే టెస్టులా ఆడాలి, మధ్యలో వన్డే స్టైల్ కావాలి, చివరికి వచ్చేసరికి టీ20లా విరుచుకుపడాలి. ఈ ఫార్మాట్‌ను నేను అర్థం చేసుకోవడానికి చాలా ప్రయత్నించాను, కానీ తన చేతికి చిక్కలేదు అంటూ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్ చేసాడు. వన్డేల్లో తన గణాంకాలు సరిగ్గా లేకపోవడం వల్లనే, ఆ ఫార్మాట్‌లో కెప్టెన్సీ రేసులో వెనుకబడ్డానని అభిప్రాయపడ్డాడు.

Also Read : సినిమా నుంచి నన్ను వేరు చేయలేరు.. పవన్ స్పీచ్ వైరల్

తన వన్డే రికార్డులు చాలా చెత్తగా ఉన్నాయన్నాడు. నాకు సుమారు 25-30 అవకాశాలు వచ్చాయి, కానీ వాటిని నేను అందిపుచ్చుకోలేకపోయానని, ఒకవేళ వన్డేల్లో బాగా ఆడి ఉంటే, టీ20లతో పాటు వన్డే కెప్టెన్సీ కూడా వచ్చేదేమోనని అప్పుడప్పుడు తన భార్యతో చర్చిస్తుంటానని గతంలో కూడా సూర్య కుమార్ వ్యాఖ్యానించాడు. టెస్టు క్రికెట్ పట్ల తనకున్న ప్రేమను సూర్యకుమార్ మరోసారి చాటుకున్నాడు. తాను 2010 నుండి 2020 వరకు దాదాపు పదేళ్ల పాటు దేశవాళీల్లో రెడ్ బాల్ క్రికెట్ ఆడాను. టెస్టులు ఆడటం అంటే నాకు ఇష్టమని.. కానీ ప్రస్తుతం టీ20లపైనే తనకు పట్టు ఎక్కువగా ఉందని, భవిష్యత్తులో అవకాశం వస్తే ఖచ్చితంగా టెస్టుల్లో సత్తా చాటాలని ఉందని చెప్పుకొచ్చాడు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

కూటమిలో చిచ్చు పెట్టిన...

అధికార కూటమిలో పైకి సమన్వయం కనిపిస్తున్నా.....

పోల్స్