Saturday, June 20, 2026 11:35 PM
Saturday, June 20, 2026 11:35 PM

షర్మిల మౌనం… మార్పుకు సంకేతమా?

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఇటీవల రాజకీయంగా పెద్దగా కనిపించడం లేదు. ఒకప్పుడు సోషల్ మీడియా, ప్రెస్ మీట్ల ద్వారా నిరంతరం స్పందించే ఆమె, ఇప్పుడు సైలెంట్‌గా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. ఈ మౌనం వెనుక కారణం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆమె స్థానంలో మార్పు ఆలోచనలో ఉందా? లేక ఆమె తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో రాజకీయంగా సర్దుబాటు చేసుకున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో సమకాలీన అంశాలపై వెంటనే స్పందించే షర్మిల, ఇటీవలి కాలంలో రాజకీయ ప్రకటనలు చేయడం లేదు. ప్రెస్ మీట్లు కూడా నిర్వహించడం లేదు. దీంతో ఏదో కీలక పరిణామం జరుగుతోందన్న భావన బలపడుతోంది.

Also Read : దావోస్ మ్యాన్.. చంద్రబాబు ఊహించని గౌరవం..!

షర్మిల నాయకత్వంపై మార్పు ఉండొచ్చన్న ప్రచారం ఒకవైపు నడుస్తుండగా, మరోవైపు రాయలసీమ కేంద్రంగా కొత్త రాజకీయ పార్టీ ప్రారంభిస్తారన్న టాక్ కూడా వినిపించింది. అయితే గతంలో తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు మీద తెలంగాణలో పార్టీ స్థాపించి, ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసిన అనుభవం ఉన్న నేపథ్యంలో, మళ్లీ కొత్త పార్టీ పెట్టే అవకాశాలు తక్కువేనని ఆమె సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఆమె రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుందన్న అంశం చర్చగా మారింది.

తెలంగాణలో రాజకీయ పార్టీ స్థాపించిన షర్మిల, తరువాత ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టారు. అయితే ఆమె హయాంలో పార్టీ ఏపీలో ఆశించిన స్థాయిలో బలపడలేదన్న విమర్శలు ఉన్నాయి. పార్టీలోని పలువురు నేతలు కూడా దూరమైన పరిస్థితి కనిపించింది. ఒక దశలో కాంగ్రెస్ పార్టీని ఏపీలో తిరిగి పుంజుకుంటారని అంచనాలు ఉన్నప్పటికీ, ఆ స్థాయిలో ఫలితాలు కనిపించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read : మిథున్ రెడ్డికి గాలం.. రంగంలోకి ఈడి

షర్మిల రాజకీయంగా ఎక్కువగా వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడానికే ప్రాధాన్యం ఇచ్చారన్న వాదన కూడా ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 19 నెలలు గడిచినా, ప్రభుత్వంపై ఆమె నుంచి తీవ్ర విమర్శలు పెద్దగా వినిపించలేదన్న వ్యాఖ్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె వ్యక్తిగత అజెండాతో వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు పార్టీ అధిష్టానానికి చేరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల షర్మిల రాయలసీమలో కొత్త పార్టీ ప్రారంభిస్తారన్న వార్తలు వచ్చినప్పటికీ, అదే సమయంలో ఆమె జగన్‌పై విమర్శలు తగ్గించడం రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించింది. కుటుంబంలో రాజకీయ రాజీ కుదిరిందన్న చర్చ కూడా తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే ఇటీవల వైఎస్ జగన్ దంపతులతో షర్మిల కుమారుడు కనిపించడంతో, ఆ ప్రచారం మరింత బలపడింది.

ఆ తర్వాత నుంచి షర్మిల రాజకీయంగా మరింత సైలెంట్‌గా ఉండటం గమనార్హం. ఈ పరిణామాలన్నింటిని కలిపి చూస్తే, ఆమె రాజకీయంగా యూటర్న్ తీసుకున్నారా? లేక ఇది తాత్కాలిక వ్యూహమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇందులో వాస్తవం ఎంత ఉందన్నది మాత్రం కాలమే వెల్లడించాల్సి ఉంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

తిరుపతిలో కేఎఫ్‌సీ, డొమినోస్‌...

ప్రముఖ అంతర్జాతీయ ఫుడ్ బ్రాండ్ల ఆహార...

తిరుపతిలో వడ్డీ మాఫియా.....

తిరుపతి నగరంలో వడ్డీ వ్యాపారం పేరుతో...

సాయికృష్ణ కేసులో వైసీపీ...

విజయవాడ రౌడీ షీటర్‌ గాదె సాయికృష్ణ...

బ్రేకింగ్: అల్లు అర్జున్‌...

హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య...

తెలంగాణాలో జనసేన తొలి...

గత కొన్నాళ్ళుగా తెలంగాణాలో పార్టీ బలోపేతం...

బ్రేకింగ్: కొడాలి అరెస్ట్...

ఏపీలో వైసీపీ కీలక నేతలకు చట్టపరమైన...

పోల్స్