Thursday, September 17, 2026 08:48 PM
Thursday, September 17, 2026 08:48 PM

దారుణంగా పడిపోయిన రూపాయి విలువ.. కారణం ఏంటీ..?

అంతర్జాతీయంగా మారుతోన్న పరిస్థితులు డాలర్ విలువపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఈ ప్రభావం మన కరెన్సీపై గట్టిగా పడింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపధ్యంలో.. పెరుగుతున్న ముడి చమురు ధరలు ప్రపంచ ఆర్థిక మార్కెట్లను అస్థిరపరచడంతో బుధవారం భారత రూపాయి విలువ బాగా బలహీనపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య పెరుగుతున్న యుద్ద తీవ్రత.. మధ్య పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తుల వైపు మొగ్గు చూపడంతో డాలర్ల విలువ పడిపోతోంది.

Also Read : డేటాతో చేసిన దాడి: ఖచ్చితత్వంతో ఖమేనీ అంతం!

తాజాగా బుధవారం మధ్యాహ్నం 12:39 గంటలకు డాలర్‌తో పోలిస్తే కరెన్సీ విలువ రూ.92.24 వద్ద ట్రేడవుతోంది, ఇది మొదటిసారిగా రూ.92 మార్కును దాటడం గమానార్హం. రూపాయి విలువను ప్రభావితం చేసే అతి పెద్ద అంశాలలో ముడి చమురు ధరల పెరుగుదల ఒకటి. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు సరఫరాలకు అంతరాయాలు ఏర్పడతాయనే భయాలను క్రమంగా పెంచుతున్నాయి. మధ్యప్రాచ్యం, ప్రధాన ఇంధన ఎగుమతిదారు కాబట్టి, అక్కడ ఏ యుద్ధం జరిగినా.. చమురు ధరలు పెరుగుతాయి.

Also Read : ఇరాన్ దెబ్బకు.. అమెరికా – ఇజ్రాయిల్ అధినేతల మధ్య గ్యాప్..?

భారత్ దాదాపు 85 శాతం చమురును దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు ఇరాన్ హార్మోజ్ జల సంధిని ఆపడంతో 20 శాతం చమురు ఆగిపోతుంది. చమురు ఖరీదైనప్పుడు, భారత్ తన అవసరాల కోసం, ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి ఎక్కువ డాలర్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. దీనితో డాలర్ విలువ క్రమంగా పెరిగి.. రూపాయిపై ఒత్తిడి పెంచేస్తుంది. అధిక ముడి చమురు ధరలు ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికా డాలర్ బలపడటం వల్ల రూపాయి కూడా బలహీనపడుతోంది. పెట్టుబడి దారులు అమెరికన్ డాలర్ లను సురక్షితంగా భావిస్తారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్