Thursday, September 17, 2026 09:43 PM
Thursday, September 17, 2026 09:43 PM

ఇరాన్ దెబ్బకు.. అమెరికా – ఇజ్రాయిల్ అధినేతల మధ్య గ్యాప్..?

ఇరాన్ – ఇజ్రాయిల్ దేశాల మధ్య నెలకొన్న యుద్ధం ఇప్పుడు తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. అమెరికా – ఇజ్రాయిల్ సంయుక్తంగా దాడి చేస్తే ఇరాన్ లొంగిపోయే అవకాశం ఉందని అందరూ భావించారు. దానికి తోడు యుద్ధం ప్రారంభం రోజునే.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ టార్గెట్ గా ఇజ్రాయిల్ దాడులు చేసి హతమార్చింది. అక్కడి నుంచి ఇరాన్ భయపడి పారిపోతుందని అందరూ అంచనా వేసారు. కానీ తమ భూభాగం నుంచి ఇరాన్ చేస్తోన్న దాడులు మాత్రం ప్రపంచాన్ని భయపెడుతున్నాయి.

Also Read : రాజకీయాల నుంచి విజయ్ అవుట్.. తండ్రి మద్దతు కోడలికే

ఎప్పటికప్పుడు మిస్సైల్స్, డ్రోన్లతో ఇరాన్ బలగాలు విరుచుకు పడుతున్నాయి. అగ్ర నాయకులు అందరినీ హతమర్చినా సరే ఇరాన్ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఇరాన్ దెబ్బకు గల్ఫ్ దేశాలు వణికిపోతున్నాయి. గాజా మాదిరిగా ఇరాన్ ను కంట్రోల్ చేయవచ్చని అంచనా వేసిన ఇజ్రాయిల్ అధ్యక్షుడు బెంజిమన్ నేతన్యాహు.. ఇరాన్ పోరాటం దెబ్బకు ఆత్మ రక్షణలో పడిపోయారు. ఇక తమ మీద ఇరాన్ నిరంతరం దాడులు చేయడంతో గల్ఫ్ దేశాలు అమెరికాపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.

Also Read : అటవీశాఖలో సంస్కరణలు: పవన్ కళ్యాణ్ వినూత్న ఆలోచన

దీనితో ఇప్పుడు ఇజ్రాయిల్ ప్రధాని నేతన్యాహు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య విభేదాలు తారా స్థాయిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్ ను అంచనా వేసే విషయంలో ఇజ్రాయిల్ నిఘా విభాగం మోసాద్ ఫెయిల్ అయిందని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇరాన్ వద్ద ఉన్న ఆయుధాలను కూడా ఇజ్రాయిల్ తక్కువ అంచనా వేసింది. ఆ స్థాయిలో క్షిపణులు ఉంటాయని ఊహించలేదు ఇజ్రాయిల్ బలగాలు. గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తూ ఒత్తిడి తెస్తున్న ఇరాన్.. ఆయా దేశాల ఆర్మీకి కూడా లొంగడం లేదు. గత ఏడాదితో క్షిపణి సామర్ధ్యం తగ్గిపోయి ఉండవచ్చని ఇజ్రాయిల్ అంచనా వేసినా.. సీన్ మాత్రం వేరే రేంజ్ లో ఉంది. ఇదే ఇప్పుడు ఇజ్రాయిల్ – అమెరికా అధినేతల మధ్య విభేదాలు తీవ్ర స్థాయిలో పెంచినట్లు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

మరో వైసీపీ కీలక...

అనంతపురం జిల్లాలో జరుగుతోన్న అక్రమ మైనింగ్...

కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్...

తెలంగాణ మాజీ సిఎం, బీఆర్ఎస్ అధినేత...

చంద్రబాబుపై కేంద్ర మంత్రి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత...

రచ్చకెక్కిన ఉత్తరాంధ్ర వైసీపీ...

శ్రీకాకుళం జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం...

గ్రామాల్లో అభివృద్ధి పండుగ,...

ఏపీ డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్...

నేను లండన్ వెళ్తా...

సోషల్ మీడియా సెలబ్రిటీ, ప్రముఖ యూట్యూబర్...

పోల్స్