Wednesday, August 19, 2026 09:48 PM
Wednesday, August 19, 2026 09:48 PM

‘రాజకీయ మౌనం’ వెనుక అసలు వ్యూహం ఇదేనా..!

కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చేపట్టిన ఓటర్ల జాబితా సమగ్ర ప్రక్షాళన రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది. తెలుగు రాష్ట్రాల్లో కలిపి సాంకేతికంగా కోటి 20 లక్షలకు పైగా ఓట్లు జాబితా నుంచి తొలగింపు ప్రక్రియలో ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటూ కీలకమే అయినప్పటికీ.. ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లు జాబితా నుంచి తొలగిపోతున్నా.. ప్రధాన రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగకపోవడం ఆసక్తికరంగా మారింది. అసలు ఈ వ్యూహాత్మక మౌనం వెనుక కారణమేంటి?

Also Read : ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో స్టార్ హీరోయిన్..!

ఈ తొలగింపులన్నీ అర్హులైన ఓటర్ల హక్కును హరించేందుకు జరుగుతున్నవి కావని, ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసే సాంకేతిక ప్రక్రియలో భాగమేనని రాజకీయ పార్టీలకు స్పష్టమైన అవగాహన ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత హైదరాబాద్ పాటు రెండు రాష్ట్రాల్లోనూ నివాసాలు కలిగి ఉన్న పలువురికి రెండు చోట్ల ఓట్లు కొనసాగుతున్నాయి. అదే సమయంలో మరణించిన వారి పేర్లు జాబితాల్లో కొనసాగడం, నివాసాలు మారినప్పటికీ పాత చిరునామాల్లో ఓట్లు ఉండటం వంటి సమస్యలు ఉన్నాయి. ఆధార్ – ఈపిక్ అనుసంధానం, ఇతర సాంకేతిక సమాచారాన్ని క్రాస్ చెక్ చేయడం ద్వారా ఇలాంటి డూప్లికేట్, ఇన్‌యాక్టివ్ ఓట్లను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. అందువల్ల దీనిని పూర్తిగా ఓటు హక్కు కాలరాసే చర్యగా భావించాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం పార్టీల్లో ఉంది. ఇదే కారణంతో ప్రధాన పార్టీలు వీధుల్లోకి వచ్చి పెద్దఎత్తున ఆందోళనలు చేయడం లేదనే విశ్లేషణ వినిపిస్తోంది.

Also Read : సాయిరెడ్డి పార్టీ.. వైసీపీలో గుబులు..!

అయితే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం ఈ అంశాన్ని కొంత సీరియస్‌గా తీసుకుంటోంది. ఎన్నికల సంఘం దృష్టికి వరుసగా ఫిర్యాదులు చేస్తోంది. దీనికి రాజకీయ కారణాలు కూడా లేకపోలేదు. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే.. పట్టణ ప్రాంతాల్లోని డూప్లికేట్, బోగస్ ఓట్లు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపాయని కాంగ్రెస్ భావిస్తోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు ఇతర పట్టణ ప్రాంతాల్లో ఓటర్ల జాబితా పూర్తిస్థాయిలో ప్రక్షాళన జరిగితే.. క్లీన్ ఓటర్ లిస్ట్ తమకు రాజకీయంగా ప్రయోజనం కలిగిస్తుందని ఆ పార్టీ అంచనా వేస్తోంది. అందుకే ప్రతి బూత్ స్థాయిలో తమ బూత్ లెవల్ ఏజెంట్లను అప్రమత్తం చేస్తూ.. తొలగింపునకు గురవుతున్న ఓట్లను పరిశీలిస్తోంది. నిజమైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది.

మరోవైపు బీఆర్ఎస్, వైసీపీ, టీడీపీ – జనసేన కూటమి వంటి పార్టీలు పెద్దగా ఆందోళనలకు దిగకపోవడానికి క్షేత్రస్థాయి పరిస్థితులే కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయా పార్టీల అంతర్గత అంచనాల ప్రకారం.. తొలగింపు జాబితాలో ఉన్న ఓట్లలో ఎక్కువ భాగం నివాసాలు మారిన వారివి, డూప్లికేట్ ఓట్లుగా ఉండే అవకాశం ఉంది. ఒకవేళ అర్హత ఉన్న ఓటరు పేరు పొరపాటున తొలగిపోయినా.. తిరిగి ఓటరుగా నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఫారమ్-6 ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. దీంతో వీధుల్లోకి వచ్చి రాజకీయ పోరాటం చేయడం కంటే.. క్షేత్రస్థాయిలో బూత్ లెవల్ అధికారులతో సమన్వయం చేసుకుని నిజమైన ఓటర్ల పేర్లను తిరిగి చేర్పించడమే మేలని పార్టీలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : సాయిరెడ్డి పార్టీ.. వైసీపీలో గుబులు..!

ఎన్నికల సంఘం క్లెయిమ్స్, అభ్యంతరాలు, ఫారమ్-7 వంటి ప్రక్రియలకు అవకాశం కల్పిస్తూ జాబితా ప్రక్షాళన చేపడుతోంది. దీంతో ప్రక్రియను పూర్తిగా వ్యతిరేకించడం రాజకీయ పార్టీలకు అంత సులభం కాదు. అదే సమయంలో తమకు మద్దతుగా ఉండే ఓటర్ల పేర్లు జాబితాలో ఉన్నాయా? లేదా? అన్నదానిపై పార్టీలు ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. కోటి 20 లక్షలకు పైగా ఓట్ల ప్రక్షాళన నేపథ్యంలో కనిపిస్తున్న ఈ ‘రాజకీయ మౌనం’ వెనుక అసలు వ్యూహం ఇదేనన్న విశ్లేషణ వినిపిస్తోంది. బహిరంగ ఆందోళనలతో రాజకీయ వేడి పెంచడం కంటే.. బూత్ స్థాయిలో ప్రతి ఓటును పరిశీలించడం, తమ మద్దతుదారుల ఓట్లను కాపాడుకోవడం, పొరపాటున తొలగిన అర్హులైన ఓటర్లను తిరిగి జాబితాలో చేర్పించడం.. ఇదే ప్రస్తుతం పార్టీల ప్రాధాన్యంగా కనిపిస్తోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

పరిశ్రమల్లో పచ్చని విప్లవం.....

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధితో పాటు...

భారత్ ఘన విజయం.....

గాలే అంతర్జాతీయ మైదానంలో శ్రీలంకతో జరిగిన...

టాలీవుడ్ కు షాక్...

తెలంగాణలో భారీ బడ్జెట్ సినిమాల టికెట్...

సాయిరెడ్డి పార్టీ.. వైసీపీలో...

ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ...

ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో...

టాలీవుడ్ ప్రముఖ నటి నిధి అగర్వాల్‌కు...

ప్రత్యక్ష ఎన్నిక.. తెలుగు...

మున్సిపల్ ఛైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లను ప్రజలు...

పోల్స్