Friday, June 19, 2026 10:33 AM
Friday, June 19, 2026 10:33 AM

నానీ యాక్టివ్ అవ్వడానికి రీజన్ అదేనా..?

2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత వైసీపీ నేతలు చాలామంది బయటకు రావడానికి భయపడిన మాట వాస్తవం. కేసుల భయంతో అక్రమాలు చేసిన చాలా మంది నాయకులు మీడియాకు దూరంగా ఉన్నారు. మరి కొంతమంది నియోజకవర్గాలకు కూడా దూరంగా ఉన్నారు. కొంతమంది నేతలు జైలుకు కూడా వెళ్లి వచ్చారు. అప్పట్లో రెచ్చిపోయిన వారికి ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. అయితే ఇప్పుడు.. సైలెంట్ గా ఉన్న వైసీపీ నేతలు ఒక్కొక్కరు దూకుడు పెంచుతున్నారు. బయటికి రాని మాజీ మంత్రులు మీడియా ముందు చెలరేగిపోతున్నారు.

Also Read : డేటాతో చేసిన దాడి: ఖచ్చితత్వంతో ఖమేనీ అంతం!

జోగి రమేష్, ఆర్కే రోజా, అంబటి రాంబాబు వంటి వారు మళ్లీ ఆక్టివ్ అయ్యారు. ఇక లేటెస్ట్ గా కొడాలి నాని కూడా తన మార్క్ కామెంట్స్ తో మీడియాలో సందడి చేశారు. ఇప్పటివరకు భయపడిన నాయకులు.. ఇప్పుడు బయటకు రావడానికి కారణం ఏంటి అనేదే ఏపీలో జరుగుతున్న చర్చ. దీనికి ప్రభుత్వం తమను ఏమీ చేయలేదు అనే ధీమానే చాలామంది నాయకుల్లో కనపడింది అంటున్నాయి రాజకీయ వర్గాలు. అంబటి రాంబాబు అరెస్టు తర్వాత.. కుల ప్రస్తావన తీసుకొచ్చి వైసీపీ చాలా జాగ్రత్తగా రాజకీయం చేసింది. ఈ విషయాన్ని ఎదుర్కొనే అంశంలో టిడిపి ఫెయిల్ అయింది అనే మాట వినపడుతోంది.

Also Read : ఆ విషయంలో బతికిపోయిన అవినాష్..!

జోగి రమేష్ విషయంలో కూడా బీసీ కార్డు వైసీపీ నాయకత్వం బయటకు తీసింది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూడా బయటకు వచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసుల్లో చార్జిషీట్ దాఖలు అవుతున్నప్పటికీ.. వాళ్లకు బెయిల్ రావడంతో ఇతర నాయకుల్లో కూడా ధైర్యం పెరిగింది. అంబటి రాంబాబు కేవలం 18 రోజుల్లో బయటకు రావడంతో.. తమను అరెస్టు చేసినా సరే పెద్దగా ఇబ్బందులు లేకుండా బయటకు వచ్చేస్తాం అనే ధీమా కూడా చాలామంది నాయకుల్లో మొదలైంది. అందుకే ఇప్పుడు నాయకత్వం మళ్లీ యాక్టివ్ గా కనబడుతోంది.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

‘పెద్ది’కి బిగ్ సర్‌ప్రైజ్.....

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్...

రఘురామ కేసుపై హైకోర్ట్...

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఐపీఎస్ అధికారి సునీల్‌...

ఏపీ లిక్కర్ స్కామ్‌లో...

ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం రవాణా...

ప్రజల్లోకి వెళ్ళాల్సిందే.. చంద్రబాబు...

ఏపీలో అధికారుల తీరుపై విమర్శలు వస్తున్న...

బ్రేకింగ్: లోకేష్ సంచలన...

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కుర్చీలో...

భయపడాల్సిన వారేమో భయపెడుతున్నారు.. భయపెట్టాల్సిన వారేమో...

పోల్స్